ఈ మధ్య సైబర్ నేరాలు ఎంతలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం.మారుతున్న టెక్నాలజీని నేరస్థులు అదునుగా మార్చుకుని లేటెస్టు ట్రెండ్‌కు తగ్గట్టు స్మార్ట్ గా మోసాలు చేసేస్తున్నారు.
పోలీసులు వీరి నేరాలపై ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కూడా జనాలు మాత్రం వీరి మాయలో పడిపోతూనే ఉన్నారు.ఈ సారి కూడా సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు.
అయితే ఈసారి ఏకంగా పోలీసుల్నే వాడేశారు ఈ సైబర్ నేరస్తులు.పైగా ఇది నిత్యం సైరబ్ పోలీసులు అలర్ట్‌గా ఉండే హైదరాబాద్ లో వెలుగు చూసింది.
ఓ నిరుద్యోగి ఎంఎస్సీ చదివుకుని ఏదైనా పెద్ద ఉద్యోగం చేయాలని ప్రయత్నంలో ఉన్నాడు.చాలా వరకు రిక్రూట్మెంట్ వెబ్ సైట్లను ఇతను నిత్యం ఆశ్రయిస్తూ ఉంటాడు.తన పూర్తి వివరాలు కూడా అందులో నమోదు చేసుకుని ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నాడు.అనుకోకుండా ఇతనికి ఒకరోజు [email protected] అనే మెయిల్ ఐడీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది.
నువ్వు ఒక అమ్మాయిని వేధిస్తున్నావు.ఆమె మీపైన కంప్లయింట్ ఇవ్వడంతో 356(ఏ) సెక్షన్ల కింద కేసులు కూడా బుక్ చేసి విచారిస్తున్నాం అంటూ అందులో ఉంది.
అంతే కాదు బాధితుడి ఫొటోలను మార్ఫింగ్ చేసి అమ్మాయితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను కూడా పంపించేసరికి యువకుడు షాక్ అయిపోయాడు.
తనకు అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదని తాను ఎవరినీ వేధించలేదంటూ రిప్లై మెసేజ్‌లు కూడా పంపిస్తూ వేడుకున్నాడు.దీంతో అతని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు తల్లిదండ్రులను తీసుకుని పోసల్ స్టేషన్‌కు రావాలంబూ బెదిరించారు.దీంతో భయపడ్డ బాధితుడు వారికి కాల్ చేసి మాట్లాడగా వారు పోలీసులమని పరిచయం చేసుకుని సెటిల్‌మెంట్ మాట్లాడుకున్నారు.దీంతో వారు అడిగినప్పుడల్లా పలు దఫాలుగా మొత్తం రూ.6.96 వారికి పంపించాడు బాధితుడు.అయితే కేసు కొట్టేశారో తెలియక బాధితుడు వారికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వస్తుండటంతో మోసపోయానని గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించాడు.