దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత చేస్తున్న చిత్రం గురించి రోజుకోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న దర్శకుడు జక్కన్న ప్రస్తుతం లొకేషన్స్‌ను వెదికే పనిలో ఉన్నాడు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలోనే ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి.ఇక మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్న దానయ్యతో కూడా మహేష్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.
ఆ కారణంగానే ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా ఉంటే బాగుంటుందని రాజమౌళి భావించాడట.ఇప్పుడు మహేష్‌బాబు కోసం కథను మార్చడం కాని, లేదంటే పాత్రను జొప్పించడం కాని జక్కన్నకు ఇష్టం ఉండదు.
అందుకే మహేష్‌బాబును ఈ చిత్రంలో కనిపించకుండా, వినిపించేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

సినిమా ఆరంభం నుండి చివరి వరకు కథను పరిచయం చేయడం, పాత్రలను పరిచయం చేయడం వంటివి మహేష్‌బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించబోతున్నారు.మహేష్‌బాబు వాయిస్ ఉన్నా కూడా సినిమా స్థాయి ఖచ్చితంగా పెరిగి పోతుంది.సినిమాను నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్‌కు సిద్దం చేస్తున్న సమయంలో మహేష్‌బాబు ఈ చిత్రంలో వినిపించబోతున్నాడు అంటూ వస్తున్న వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
ఈ విషయమై మహేష్‌బాబు లేదంటే జక్కన్న అండ్ కో నుండి క్లారిటీ రావాల్సి ఉంది.ప్రస్తుతం మహేష్‌బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇక జక్కన్న మల్టీస్టారర్ చిత్రం 2020వ సంవత్సరంలో రాబోతుంది.







