మరో దారి లేని పరిస్థితుల్లో బన్నీ ఒప్పేసుకున్నాడు..

అల్లు అర్జున్‌ చాలా అంచనాలు పెట్టుకుని, ప్రతిష్టాత్మకంగా, ప్రయోగాత్మకంగా చేసిన చిత్రం ‘నా పేరు సూర్య’.ఆర్మీ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ కనిపించాడు.

 Allu Arjun Next With Director Vikram Kumar-TeluguStop.com

సూర్య పాత్ర కోసం బన్నీ చాలా కష్టపడ్డాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు బన్నీ పడ్డ తాపత్రయం అంతా ఇంతా కాదు.

ఇంత చేసినా కూడా సినిమా ఫ్లాప్‌ అయ్యింది.అందుకే కథ ఎంపిక విషయంలోనే చాలా జాగ్రత్తలు పడాలని బన్నీ నిర్ణయించుకున్నాడు.

అందుకే తదుపరి చిత్రంలో పలు సార్లు ఆలోచించాడు.

బన్నీ తదుపరి చిత్రం విక్రమ్‌ కుమార్‌తో ఉండాల్సింది.‘నా పేరు సూర్య’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో బన్నీ కాస్త ఆలోచనల్లో పడ్డాడు.విక్రమ్‌ కుమార్‌తో మూవీ ప్రయోగాత్మకంగా ఉంటుందని, తప్పకుండా అది నచ్చుతుందో లేదో చెప్పలేదు.

అందుకే విక్రమ్‌ కుమార్‌తో మూవీ కంటే ప్రస్తుతం ఒక కమర్షియల్‌ మూవీని చేస్తేబాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అయ్యింది.అందుకే పలువురు దర్శకులను ఈయన సంప్రదించాడు.విక్రమ్‌ కుమార్‌తో తప్ప మరో దర్శకుడితో కూడా అల్లు అర్జున్‌కు చేసే ఛాన్స్‌ లేదు.

ఏ కథ విన్నా కూడా విక్రమ్‌ తీసుకు వచ్చిన కథ కంటే బెటర్‌గా అనిపించలేదు.

దానికి తోడు అంతా కూడా చిన్న దర్శకులే ఉన్నారు.స్టార్‌ దర్శకులు అంతా కూడా ఇతరత్ర సినిమాలతో బిజీగా ఉన్నారు.

కనుక తప్పనిసరి పరిస్థితుల్లో తదుపరి చిత్రాన్ని విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చేయాలని బన్నీ నిర్ణయించుకున్నాడు.విక్రమ్‌ కుమార్‌ రెడీ చేసిన స్క్రిప్ట్‌కు బన్నీ ఓకే చెప్పాడు.

ప్రస్తుతం దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ హీరోయిన్‌ మరియు ఇతర నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఆయన చేస్తున్నాడు.అల్లు అర్జున్‌తో చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో చిత్రాన్ని చేస్తున్నట్లుగా గతంలో దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.వీరిద్దరి కాంబో మూవీ త్వరలో ప్రారంభం అయ్యి, వచ్చే ఏడాది సమ్మర్‌లో వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube