తన కళ్ళజోడు అడిగిన నటుడికి మహేష్ మైండ్ బ్లాంక్ ఆన్సర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Mahesh Shocking Reply To Star Actor Who Asked For His Spectacles , Mahesh Babu , Samudrakhani , Sarkaru Vaari Paata , Spectacles , Powerful Villain , Kirti Suresh , Parashuram Petla-TeluguStop.com

మహేష్ బాబు వరుస హ్యాట్రిక్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ లలోకి వచ్చి తొలిరోజే మిశ్రమ స్పందన అందుకుంది.

 Mahesh Shocking Reply To Star Actor Who Asked For His Spectacles , Mahesh Babu , Samudrakhani , Sarkaru Vaari Paata , Spectacles , Powerful Villain , Kirti Suresh , Parashuram Petla-తన కళ్ళజోడు అడిగిన నటుడికి మహేష్ మైండ్ బ్లాంక్ ఆన్సర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.విలన్ పాత్రలో రాజేంద్రనాథ్ గా సముద్రఖని అదరగొట్టాడు.అల వైకుంఠపురములో విలన్ గా చేసిన సముద్రఖని మరోసారి సర్కారు వారి పాటలో అంతకు మించి పవర్ ఫుల్ విలన్ గా మెప్పించాడు.

మహేష్ కూడా సముద్రఖని పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు.

సముద్రఖని సెట్ లో బిహేవియర్ గురించి కూడా బాగా చెబుతూ ఆయనపై ప్రశంసలు కురిపించాడు.అలాగే ఈ క్రమంలోనే మహేష్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చాడు.సముద్ర ఖని కి కళ్లజోళ్లు సేకరించే అలవాటు ఉందట.ఎక్కడైనా డిఫెరెంట్ గా కొత్తగా కళ్లజోళ్లు కనిపిస్తే వాటిని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడట.

సర్కారు షూటింగ్ స్పాట్ లో అందంగా లో కనిపించిన మహేష్ బాబును సముద్రఖని ప్రశంసించాడు.మహేష్ కళ్లజోళ్లు నచ్చడంతో సముద్రఖని ఆయనను మీ కళ్ళజోళ్ళలో ఒకటి ఇస్తారా.మీ గుర్తుగా దాచుకుంటాను అని అన్నారట.మహేష్ వెంటనే మీ నటన బాగుంది.మీకు ఒక్క కళ్ళజోడు ఏంటి? కళ్ళజోడు షాపునే కొనిస్తానని చెప్పాడట.ఈ మాట విన్న సముద్రఖని ఆనందం వ్యక్తం చేసాడట.

మరి మహేష్ బాబు చెప్పినట్టు సముద్రఖనికి కళ్ళజోడు ఇస్తాడా? కళ్లజోళ్ల షాప్ కొనిస్తాడా చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube