టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )ప్రస్తుతం జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే ఈయన ఎప్పుడు వెళ్ళిన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తారు.
కానీ ఈసారి మాత్రం సోలోగా వెళ్లారు.ఈ విధంగా మహేష్ బాబు ఒంటరిగా జర్మనీ వెళ్లడంతో అందరూ కూడా రాజమౌళి( Rajamouli ) సినిమాలోని పనుల నిమిత్తమే ఈయన జర్మనీ వెళ్లారు అని భావిస్తున్నారు కానీ తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తే మాత్రం ఈయన జర్మనీలో డాక్టర్ని కలవడానికి వెళ్లారని తెలుస్తోంది.
ఈ విధంగా మహేష్ బాబు డాక్టర్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూస్తున్నటువంటి అభిమానులు అసలు మహేష్ బాబు ఇప్పుడు డాక్టర్ని ఎందుకు కలిశారు ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు.అయితే ఆయన ఫిట్నెస్ డాక్టర్ అని గతంలో కూడా మహేష్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.తాను ఎప్పుడు జర్మనీ వెళ్లిన డాక్టర్ తప్పనిసరిగా కలుస్తానని మహేష్ బాబు వెల్లడించారు.
ఇక మహేష్ కలిసిన డాక్టర్ పేరు హరీ కొనిగ్( Harry Konig ).అతను బాడీ ఫిట్‌నెస్ కి సంబంధించిన డాక్టర్ అని తెలుస్తుంది.ఇటీవల కాలంలో మహేష్ బాబు తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ పెట్టారు తనకు ఏమాత్రం విరామం దొరికిన వెంటనే జిమ్ లో భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ కనిపిస్తున్నారు.అయితే ఇదంతా కూడా రాజమౌళి సినిమా కోసమే ఈయన కష్టపడుతున్నారని తెలుస్తుంది.
ఇప్పుడు కూడా రాజమౌళి సినిమా కోసమే ఫిట్నెస్ విషయంలో డాక్టర్ని కలిశారని సమాచారం.ఇక రాజమౌళి మహేష్ కాంబినేషన్లో రాబోయే సినిమా ఓ అడ్వెంచరస్ మూవీ గా రాబోతుందని ఈ సినిమా మొత్తం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది
.