టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి మనందరికీ తెలిసిందే.మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
సూపర్ స్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.అయితే చిన్నప్పటి కృష్ణ పాత్రలతోపాటు నాన్నతోపాటు కలిసి నటించాడు.
తమ్ముడి పాత్రలు కూడా పోషించాడు.

దాదాపు తొమ్మిది సినిమాల్లో మహేష్ బాబు కనిపించాడు.అందులో కొడుకు దిద్దిన కాపరం చిత్రం( koduku diddina kapuram ) ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.ఆ తరువాత రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు మహేష్.
కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.ఇది ఓ మోస్తారుగానే ఆకట్టుకుంది.
హిట్ అని చెప్పలేని పరిస్థితి.ఆ తరువాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఈ క్రమంలో కృష్ణవంశీ మ్యాజిక్ పనిచేసింది.ఫ్యామిలీ అనుబంధాలు, ఎమోషన్స్ తో తెరకెక్కిన మురారీ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.

ఇందులోని పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చేపవచ్చు.ఆ తర్వాత టక్కరిదొంగ, బాబీ చిత్రాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి.ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా కెరీర్ మొదటి భాగంలో తనకు ఎవరూ పారితోషికాలు ఇవ్వలేదట.ఇది నీకు రెమ్యూనరేషన్ అని ఫిక్స్ చేసి ఎవరూ ఇచ్చింది లేదన్నాడు మహేష్.
ఖర్చుల వరకు తప్పితే పెద్దగా ఇవ్వలేదని తెలిపారు.కమర్షియల్ హిట్స్ పడ్డాక పారితోషికం ఇవ్వడం స్టార్ట్ చేశారని తెలిపారు.
ఈ లెక్కన మహేష్‌కి ఒక్కడు వరకు పెద్దగా పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది.కాగా మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాలు నష్టపోతే పారితోషికాలు వెనక్కి ఇచ్చేవాడు, నిర్మాతగా ఉన్నప్పుడు కూడా అలానే చేశాడు.
ఆ అలవాటు మీక్కూడా ఉందా అని అడగ్గా.కెరీర్ మొదటి భాగంలో తాను పారితోషికం తీసుకోలేదని, ఎవరూ రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అని తెలిపారు మహేష్.