టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో మహేష్ తన కెరీర్‌లో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకోవడంతో, తన నెక్ట్స్ మూవీ ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కించేందుక మహేష్ పూర్తిగా రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా పట్టాలెక్కకముందే మహేష్ ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడట.
ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మహేష్ కూడా త్వరలో ఈ రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు.గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం ఆయనకు పలు అవార్డులతో పాటు రివార్డులను తెచ్చిపెట్టింది.
ఇక కమర్షియల్ పరంగా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.ఈ సినిమాలోని కంటెంట్ ఇంతటి సక్సెస్‌కు ముఖ్య కారణమని భావించిన మహేష్, ఇప్పుడు శ్రీమంతుడు సినిమాను వెబ్ సిరీస్‌గా తెరకెక్కించాలని చూస్తున్నాడు.
ఇలాంటి సబ్జెక్ట్ ఎలాంటి ప్రేక్షకులకైనా దగ్గరవుతుందని మహేష్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.దీంతో ఈ సినిమాను వెబ్ సిరీస్‌గా మలిచి ప్రేక్షకులకు అందించేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు.అయితే ఇందులో మహేష్ నటిస్తాడా లేక ఈ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూ్స్ చేస్తాడా, ఈ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్, నటీనటులు ఎవరనే విషయాలు తెలియాల్సి ఉంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మహేష్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే.