సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాతో మహేష్ మరోసారి ఆల్‌టైమ్ రికార్డ్స్ సృష్టించడం ఖాయమని చిత్ర యూనిట్‌తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా ఈ సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడా అని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ సినిమాకు మహేష్ భారీ మొత్తంలో పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను తన రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడు.అయితే ఇటీవల సన్ టీవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జాయింట్‌గా రూ.30 కోట్లకు తీసుకున్నారు.హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.15 కోట్లకు డీల్ కుదిరింది.ఇతర రైట్స్ విలువ కూడా మరో కోటి వరకు ఉంటాయట.
ఇవన్నీ కలిపితే 46-47 కోట్లకు చేరుతుంది.కాగా జీఎస్టీని మినహాయిస్తే రూ.41 కోట్లు మహేష్ రెమ్యునరేషన్‌గా మిగులుతుంది.మహేష్ బాబు కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్‌గా తెలుస్తోంది.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా సంక్రాంతి బరిలో ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేస్తున్నారు.