మహేష్ జక్కన్న మూవీకి ప్రచారంలో మరో కొత్త టైటిల్.. సూపర్ టైటిల్ అంటూ? 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు( SS Rajamouli, Mahesh Babu ) కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలుకాకముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

కాగా ఆర్ఆర్ఆర్( RRR ) తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త మరింత పెరిగాయి.

అయితే చిత్ర‌బృందం ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌లేదు.ఇక ఆ సంగతి అటు ఉంచితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఎప్పటికి ఎన్నో రకాల వార్తలు వినిపించిన తెలిసిందే.అంతేకాకుండా ఎన్నో రకాల పేర్లు కూడా వినిపించాయి.

Advertisement

కానీ ఆ వార్తలన్నీ కూడా అవాస్తవాలు గానే మిగిలిపోయాయి.ఇకపోతే వచ్చే నెల అనగా ఆగ‌స్టు 9 మ‌హేష్ పుట్టిన రోజు.

ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వస్తుందేమో అని మ‌హేష్ అభిమానులు భావిస్తున్నారు.కానీ ఈ విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త లేదు.

రాజ‌మౌళి మ‌హేష్ బ‌ర్త్ డే కోసం ప్ర‌త్యేక‌మైన ప్లాన్స్ చేస్తున్న‌ట్టు ఏం క‌నిపించ‌డం లేదు.

కాస్త ఆల‌స్య‌మైనా అభిమానుల్ని అల‌రించే అప్‌డేట్ తో రావాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.అదేమిటంటే ఈ సినిమాకు గోల్డ్‌ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారట.

సాఫ్ట్ బాల్ లో ప్రతిభతో చిన్న వయస్సులోనే గవర్నమెంట్ జాబ్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఈ తెలుగు సాంగ్స్ ఎవరు పాడారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

గోల్డ్‌ అనేది యూనివ‌ర్స‌ల్ టైటిల్( Gold is a universal title ).అందుకే చిత్ర‌బృందం ఈ టైటిల్ కే మొగ్గు చూపే అవ‌కాశాలు ఉన్నాయట.ఈ సినిమా ప్రారంభానికి ముందే ఒక ప్ర‌త్యేక‌మైన గ్లింప్స్ విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయని, ఈ గ్లింప్స్ లో ఇత‌ర న‌టీన‌టుల‌కు సంబంధించిన వివ‌రాలు ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

Advertisement

అదే రోజున టైటిల్ ప్ర‌క‌టిస్తారా, లేదంటే ఇది వ‌ర్కింగ్ టైటిల్ గా అనుకొంటున్నారా? అనే సంగ‌తులు తెలియాల్సి వుంది.ప్ర‌స్తుతానికైతే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్క్రిప్టు ప‌నులు పూర్తి చేశారు.

త్వ‌ర‌లోనే రాజ‌మౌళి ఒక వ‌ర్క్ షాప్ కూడా నిర్వ‌హిస్తారు.ఆ త‌ర‌వాతే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్తుంది.

విలన్ గా ఇందులో విక్ర‌మ్ న‌టిస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు