Mahesh Babu : ఫోన్ పే యాడ్ లో నటించడానికి మహేష్ రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా.. సూపర్ స్టార్ రేంజ్ వేరే అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా యాడ్స్ లో నటిస్తూ బుల్లితెర అభిమానులకు సైతం దగ్గరవుతున్నారు.మహేష్ బాబు పారితోషికం విషయం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఫోన్ పే యాడ్ కోసం మాత్రం మహేష్ బాబు( Mahesh Babu ) 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేశారని తెలుస్తోంది.

 Mahesh Babu Phone Pe Ad Payment Details Here Goes Viral In Social Media-TeluguStop.com

చాలా కాలం క్రితమే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరిందని భోగట్టా.

ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోన్ పే కంపెనీ( PhonePe ) పేమెంట్స్ కు సంబంధించిన స్పీకర్స్ లో తన వాయిస్ వినిపించేలా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.ఫోన్ పే మర్చెంట్ క్యూఆర్ కోడ్( QR code ) లను స్కాన్ చేసిన సమయంలో ఇకపై మహేష్ బాబు వాయిస్ ను మనం వినబోతున్నాం.ఈ విధంగా మహేష్ బాబుకు సైతం పాపులారిటీ మరింత పెరగనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నా ఆ సినిమాలు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా అడుగులు వేస్తున్నారు.సూపర్ స్టార్ రేంజ్ కు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ బాబు మరిన్ని యాడ్స్ లో నటించి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి క్రేజీ అప్ డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.మహేష్ రాజమౌళి కాంబో వేరే లెవెల్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube