సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట‘ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకు పోతుంది.
ఈ సినిమా ఇప్పటికే మూడవ వారంలోకి అడుగు పెట్టిన కూడా ఇంకా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ అవుతూ కలెక్షన్స్ బాగానే రాబడుతుంది.ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
ప్రెసెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.సర్కారు సక్సెస్ తర్వాత ఈయన అమెరికాకు వెళ్లి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక్కడి నుండి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నాడు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు లిస్టులో మరొక మాస్ డైరెక్టర్ చేరిపోయినట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.
ఈ డైరెక్టర్ మహేష్ తో సినిమా చేయాలనీ మైత్రి మూవీ మేకర్స్ తో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఆ మాస్ డైరెక్టర్ ఎవరంటే గోపీచంద్ మలినేని.
క్రాక్ వంటి మాస్ హిట్ పడ్డాక ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.చూస్తుంటే ఈ సినిమాతో కూడా విజయం అందుకునేలాగానే కనిపిస్తున్నాడు.

అందుకే నిర్మాతలు ఈయనకు మరొక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట.బాలయ్యతో హిట్ కొడితే మహేష్ బాబు తో సినిమా చేయడం పక్కా అని అంటున్నారు.గోపీచంద్ మలినేని కి కూడా మహేష్ బాబు తో సినిమా చేయడం అనేది తన డ్రీమ్ అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.మరి ఈ మాస్ డైరెక్టర్ ఎలాంటి కథతో మహేష్ బాబు ను ఒప్పిస్తాడో వేచి చూడాల్సిందే.








