తెలుగు హీరో ప్రిన్స్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కబోయే మూవీకి సంబంధించిన పనులను చూసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు.అయితే రాజమౌళి( Rajamouli ) సినిమా కోసం ఆయన పూర్తిగా మారిపోతున్నారని అంటున్నారు.
ఇటీవల ఆయన మేకోవర్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.విదేశీ ట్రైనర్ సమక్షంలోనూ మహేష్ శిక్షణ తీసుకున్నారు.
ఆ మధ్య ఎయిర్ పోర్ట్ లో, ఇతర కార్యక్రమాల్లో కొత్త లుక్‌లో కనిపించారు.

దీంతో రాజమౌళితో చేయబోయే ఎస్‌ఎస్‌ఎంబీ29( SSMB29 ) సినిమా కోసమే ఈ లుక్ అనే వార్తలు వినిపించాయి.కాస్త గెడ్డంతోనూ కనిపించాడు మహేష్.అందులో ఆఫ్రికన్ అడవుల్లో సాహసికుడిగా కనిపిస్తాడనే వార్తల నేపథ్యంలో అదే ఆయన లుక్కేమో అనుకున్నారు.
అయితే ఈ మూవీ కోసం ఎనిమిది రకాల లుక్ టెస్ట్ లను ఎంపిక చేశారట.ఇందులో ఫైనల్‌గా ఒక దాన్ని ఎంపిక చేయబోతున్నారట.ఈ నేపథ్యంలో మహేష్ సడెన్‌గా లుక్ మార్చాడు.సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
బ్లాక్ కోట్ ధరించి, స్టయిలీష్ గ్లాసెస్ ధరించాడు మహేష్.

హాలీవుడ్ హీరోలను మించి కనిపిస్తున్నాడు.మోస్ట్ హ్యాండ్సమ్‌గా ఆయన లేటెస్ట్ లుక్ ఉండటం విశేషం.తాజాగా మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా దీన్ని పంచుకున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా ఆయన అభిమానులను ఈ లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.దీంతో ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ, ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.దీనిపై వాళ్లు కామెంట్ చేస్తున్నారు.హాలీవుడ్ హీరోలు కూడి దిగదుడుపే అంటున్నారు.
అదే సమయంలో రాజమౌళి సినిమా కోసం చేసిన లుక్ ఇదేనా? అనే డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కోసం కూడా ఇలాంటి ఫోటో షూట్లు చేస్తుంటారు? మరి ఈ నయా లుక్ దేని కోసమనేది తెలియాల్సి ఉంది.