మహేష్ డాన్స్ కి కారణం సంతోషమా? కోపమా?

సూపర్ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన సర్కారు వారి పాట విడుదల అయిన వెంటనే కొందరు కావాలని బ్యాడ్‌ ప్రచారం చేశారు.

 Mahesh Babu Dance In Sarkaru Vaari Paata Movie Function Mahesh Babu , Mahesh Bab-TeluguStop.com

సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో సర్కారు వారి పాట డిజాస్టర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.మైత్రి మూవీ మేకర్స్ వారు వెంటనే ఆ ప్రచారంకు చెక్ పెట్టి జాగ్రత్త పడింది.

చాలా విధాలుగా ప్రయత్నాలు చేసి సినిమాకు ఒక మోస్తరు వసూళ్లు వచ్చేలా చేసింది.ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్‌ కు దగ్గర పడింది అనడంలో సందేహం లేదు.

సినిమా భారీ బ్లాక్ బస్టర్ అని కాదు కాని మంచి సినిమానే అన్నట్లుగా టాక్‌ దక్కించుకుని మంచి వసూళ్లను నమోదు చేస్తుంది.

ఈ సమయంలో సినిమా యొక్క సక్సెస్ పార్టీని కర్నూలులో నిర్వహించారు.

భారీ ఎత్తున సినిమా వేడుక అక్కడ నిర్వహించడంతో అభిమానులు చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా తరలి వచ్చారు.దాంతో మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.

తనపై కొందరు నెగటివ్‌ ప్రచారం చేసిన విషయం ను మహేష్ బాబు సీరియస్ గా తీసుకున్నాడు.తన సినిమాలను టార్గెట్‌ చేస్తున్న వారికి కౌంటర్ ఇవ్వాలనుకున్నాడట.

అందుకే సర్కారు వారి పాట సినిమా యొక్క సక్సెస్ వేడుక సందర్బంగా మహేష్ బాబు ఎప్పుడు లేనిది ఒక స్టెప్పు వేశాడు.అది ఖచ్చితంగా మహేష్ బాబు కోపంతో వేశాడు అనేది కొందరి అభిప్రాయం.

కొందరు మాత్రం మహేష్‌ బాబు డాన్స్ కు కారణం ఆయన సంతోషం అంటున్నారు.అసలు విషయం ఆ మహేష్‌ కే తెలియాలి.

  మహేష్‌ బాబు డాన్స్ వీడియో లు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube