మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన చిరు లుక్ తాజాగా లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ సినిమాలో ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాలో చిరు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, చిత్ర యూనిట్ అంటోంది.అయితే ఈ పాత్రకు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఈ సినిమాలో ఓ స్టార్ హీరోను వాడుకోనుంది చిత్ర యూనిట్.
మెగాస్టార్ పాత్రను హైలైట్ చేసేందుకు ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ కేమియో పాత్రలో నటింపజేయాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నాడు.
గతంలో మహేష్‌తో కొరటాల రెండు సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.
దీంతో ఇప్పుడు ఆయన కోరికమేరకు చిరంజీవి చిత్రంలో నటించేందుకు మహేష్ కూడా ఓప్పుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.తన పాత్ర నచ్చడంతో మహేష్ కూడా ఈ సినిమాలో నటించేందకు వెంటనే ఓకే చెప్పాడట.
అయితే ఈ కేమియోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉందని చిత్ర యూనిట్ అంటోంది.