అడ్డాలను తిట్టొద్దు అంటున్న మహేష్ బాబు

బ్రహ్మోత్సవం సినిమా అభిమానులకే కాదు, సినిమా యూనిట్ కి కూడా చుక్కలు చూపిస్తోంది.ఈ మధ్యే మహేష్ ని కించపరుస్తూ కథనం రాసారని ఇండియన్ ఎక్సప్రెస్ దినపత్రిక ఆఫీసుకి ఫోన్ చేసి మొదట బూతులు తిట్టిన మహేష్ అభిమానులు, ఆ తరువాత దినపత్రిక కార్యాలయాన్ని ముట్టడించి, ఆ కథనాన్ని రాసిన రచయితను ఉద్యోగం లోంచి సంస్థ తీసేసేంతవరకు నిద్రపోలేదు.

 Mahesh Babu Asks His Fans Not To Blame Addala For Brahmotsavam-TeluguStop.com

ఇక బాలత్రిపురమణి సాంగ్ లో మహేష్ చేసిన డ్యాన్సులను అందరు హేళన చేస్తుండటంతో ఆ సాంగ్ కి నృత్యాలు సమకూర్చిన దినేష్ మాస్టర్ ని కూడా అనరాని మాటలన్నారట మహేష్ ఫ్యాన్స్.అక్కడితో ఆగకుండా శ్రీకాంత్ అడ్డాలకి కూడా ఫోన్ చేసి తిట్టేస్తున్నారట.

అందుకే మహేష్ బాబు స్వయంగా ఫ్యాన్స్ తో మాట్లాడాల్సి వచ్చింది.

లండన్ కి వెళ్ళేముందు కొంతమంది సినియర్ అభిమానులతో, శ్రీకాంత్ అడ్డాలను ఏమి అనొద్దని, సినిమా ఆడనందుకు పూర్తి బాధ్యత తనదే, ఈ సినిమా చేయడం కూడా తన తప్పే అని మహేష్ అన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube