ఉగాదికి మహేష్ బాబు ఫ్యాన్స్‌ ఫీల్ అవ్వక తప్పదా?

Mahesh Babu And Trivikram Movie Movie Look And Title Not Yet Confirm , Mahesh Babu,trivikram , SSMB28,Sarathi Studio,Ugadi

మహేష్ బాబు( mahesh babu ) హీరో గా త్రివిక్రమ్( trivikram ) దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.ఇటీవల సారథి స్టూడియో( Sarathi Studio ) లో ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతున్నట్లుగా సమాచారం అందింది.

 Mahesh Babu And Trivikram Movie Movie Look And Title Not Yet Confirm , Mahesh Ba-TeluguStop.com

ఇక ఈ సినిమా నుండి ఉగాది ( Ugadi )కి ఫస్ట్ లుక్ వస్తుందని అంతా భావించారు.మహేష్ బాబు అభిమానులు మీడియా లో వచ్చిన వార్తలతో ఆశలు పెట్టుకునే ఎదురు చూస్తున్నారు.

టైటిల్ ని రివీల్ చేయడం తో పాటు కచ్చితంగా సినిమా యొక్క విడుదల తేదీ విషయం లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంత భావించారు.కానీ ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.అలాగే టైటిల్ కి సంబంధించిన అప్డేట్ కూడా లేదు.దాంతో సినిమా ఫస్ట్‌ లుక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి కచ్చితంగా నిరాశ తప్పదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఖచ్చితం గా మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది.ఇప్పటికే మహేష్ బాబు అభిమానులను ఊరించి పలు సార్లు ఉసూరుమనిపించిన దర్శకుడు త్రివిక్రమ్ మరో సారి అదే తీరుగా వ్యవహరిస్తే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూజ హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా కీలక పాత్ర లో నటిస్తుందని ప్రచారం జరుగుతుండగా ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబోలో సినిమాను చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఇన్నాళ్లుగా సినిమా పట్టాలెక్కలేదు.

ఎట్టకేలకు వీరిద్దరి కాంబో సినిమా మళ్లీ రాబోతుంది.అతడు.

ఖలేజా సినిమా తర్వాత రాబోతున్న మూవీ ఇదే.

Video : Mahesh Babu And Trivikram Movie Movie Look And Title Not Yet Confirm #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube