సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేయాల్సి ఉంది.
ఆ సినిమా కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.దర్శకుడు సుకుమార్ దాదాపు ఏడాదిన్నర పాటు మహేష్ బాబు కోసం ఎదురు చూశాడు.
తీరా షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్న సమయానికి మహేష్ బాబు స్క్రిప్ట్ విషయం లో కొన్ని లోపాలు ఉన్నాయంటూ సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు.ఆ సమయం లో సుకుమార్ తీవ్ర స్థాయిలో మహేష్ బాబు పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తన రెండున్నర ఏళ్ల సమయాన్ని వృధా చేశాడు అంటూ మహేష్ బాబు సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరిగింది.వీరిద్దరి మధ్య విభేదాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే.
కానీ తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం లో సుకుమార్ కనిపించి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు అన్నింటికీ పుల్ స్టాప్ పెట్టినట్లు చేశాడు.వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి అనేది అందరికీ తెలిసు.

కానీ వీరిద్దరూ మళ్ళీ కలవడం వెనుక ఉన్నది ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.మాకు అందిన సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వీరిద్దరి మధ్య గొడవలు సర్దుమనిగేలా ప్రయత్నం చేశారు. నవీన్ యెర్నేని మాట్లాడి మహేష్ బాబు మరియు సుకుమార్ మధ్య గొడవ సద్దుమణిగేలా చేశాడంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఏది ఏమైతేనేం మహేష్ బాబు మరియు సుకుమార్ కలిసి పోయారు.
కనుక ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.