మహేష్ బాబు హీరో గా రాజమౌళి దర్శకత్వం లో ఒక సినిమా రావాల్సి ఉంది.దాదాపు దశాబ్ద కాలం గా ఈ సినిమా వాయిదా వేస్తూ వస్తున్నట్లుగా ఆ మధ్య స్వయంగా దర్శకుడు రాజమౌళి పేర్కొన్నాడు.
మళ్లీ ఇన్నాళ్ల కు ఆ సినిమా గురించిన హడావుడి జరుగుతుంది.రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అద్భుతమైన ఆస్కార్ కి కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యం లోనే రాజమౌళి తో సినిమా అంటే హాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు.
అందుకే మహేష్ బాబు హీరో గా రాజమౌళి దర్శకత్వం లో సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయం లోనే కథ రెడీ అయిందని హీరోయిన్ మరియు ఇతర విషయాల గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు స్టోరీ లైన్ రెడీ అవ్వలేదు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విషయం లోనే ఫుల్ బిజీ గా ఉన్నాడు.అందుకే విజయేంద్ర ప్రసాద్ రెండు మూడు స్టోరీ లైన్స్ రెడీ చేసినా కూడా వాటిని విని ఒకే చెప్పలేదని తెలుస్తోంది.అతి త్వరలోనే స్టోరీ లైన్ కి సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకొని ఆ తర్వాత కానీ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టే అవకాశం ఉంది.
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం కూడా స్క్రిప్ట్ వర్క్ లో నిమగ్నం అవ్వాల్సి ఉంటుంది.

అందుకే కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంది.అలాగే హాలీవుడ్ నటీనటులు ఈ సినిమా లో నటించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా స్క్రిప్ట్ రెడీ కాకుండానే హాలీవుడ్ నటీనటుల నటించబోతున్నారు అంటూ ప్రచారం జరగడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కు ఉన్న క్రేజ్ ఏ పాటిదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.







