మహర్షి కలెక్షన్స్‌ : రూ. 200 కోట్ల గ్రాస్‌ సరే మరి షేర్‌ పరిస్థితి ఏంటీ?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రం మహర్షి చిత్రం కలెక్షన్స్‌ తో అభిమానులను మరియు ప్రేక్షకులను గందరగోళంలోకి నెట్టేసేలా వ్యవహరిస్తున్నారు.

మహేష్‌ బాబు 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం జరిగింది.సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో సినిమాను బయ్యర్లు ఏకంగా 100 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.

సినిమా వంద కోట్లు రాబట్టడం సాధ్యమే అని అంతా భావించారు.

సినిమాకు మొదటి రోజే నెగటివ్‌ టాక్‌ వచ్చింది.అయితే సినిమాకు యూనిట్‌ సభ్యులు చేసిన ప్రమోషన్‌ మరియు ఇతరత్ర కారణాలతో మహర్షి మంచి వసూళ్లను దక్కించుకుంది.అయితే వంద కోట్ల రూపాయలను మాత్రం దక్కించుకోలేక పోతుందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

వంద కోట్లు వస్తే కాని సినిమాకు బ్రేక్‌ ఈవెన్‌ దక్కినట్లు అవుతుంది.వంద కోట్ల షేర్‌ సులభంగానే వస్తుందని భావించినా కూడా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పది కోట్ల వరకు మైనస్‌ లో ఉండే అవకాశం ఉందని అనిపిస్తుంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ చిత్రం షేర్‌ కలెక్షన్స్‌ ఎంత వచ్చాయి అనే విషయాన్ని చెప్పకుండా గ్రాస్‌ కలెక్షన్స్‌ లెక్కలు చూపుతున్నారు.బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందా లేదా అనేది తెలియాలి అంటే సినిమా దక్కించుకున్న షేర్‌ ఎంత అనే విషయం తెలియాల్సి ఉంటుంది.షేర్‌ ఎంతో చెప్పకుండా మొన్నటికి మొన్న 175 కోట్ల గ్రాస్‌ అంటూ ప్రచారం చేశారు, ఇప్పుడు 200 కోట్ల క్లబ్‌లో మహర్షి జాయిన్‌ అయ్యింది అంటూ చెబుతున్నారు.మరి షేర్‌ మాత్రం ఎందుకు చెప్పడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.100 కోట్ల షేర్‌ వచ్చి ఉంటుందని కొందరు భావిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వచ్చి ఉండదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు