హ్యాట్సాప్‌ : టీ తాగడానికి డబ్బులు లేవు, రూ.40 వేలు దొరికితే ఏం చేశాడో తెలుసా?

రెండు రూపాయల కోసం హత్యలు జరుగుతున్న కాలం ఇది.డబ్బు కోసం గడ్డి తింటారు అనే సామెత ఉంది.

కేవలం గడ్డి మాత్రమే కాకుండా తవుడు తినడం నుండి ఫినాయిల్‌ తాగడం వరకు కూడా అన్ని డబ్బు కోసం చేస్తున్నారు.డబ్బు కోసం ఏం చేసేందుకు అయినా సిద్ద పడుతున్న ఈ సమాజంలో కొందరు మంచి వారు కూడా ఉండటం వల్ల ఇంకా ఈ సమాజం ఇలా మిగిలి ఉందని, మంచివారు ఉండటం వల్ల ఇంకా ఈ సృష్టి ఉందనిపిస్తుంది.

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జగ్దాలే అనే వ్యక్తి ఉన్నాడు.ఆయన లాంటి వారు ఉన్న కారణంగానే ఇంకా ఈ భూమి ఉందనిపిస్తుంది.

ఇంతకు జగ్దాలే ఎవరు, ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.జగ్దాలే ఒక నిరుపేద.ఆయన అత్యంత కఠినమైన పేదరికంను అనుభవిస్తున్నాడు.

Advertisement

అలాంటి పేదరికంలో ఉన్న ఆయన ఒక రోజు బస్‌ స్టాండ్‌లో ఉన్నాడు.సొంత ఊరికి వెళ్లేందుకు చేతిలో డబ్బులు లేవు, కనీసం టీ తాగడానికి అయిదు రూపాయలు లేవు.

ఎలా అని చూస్తున్న సమయంలో అతడికి పక్కన ఒక బ్యాగ్‌ దొరికింది.

ఆ బ్యాగ్‌ ఓపెన్‌ చూడగా 40 వేల రూపాయలు అందులో ఉన్నాయి.డబ్బు చూడగానే ఎవరికైనా ఆశ కలుగుతుంది.కాని జగ్దాలేకు మాత్రం ఆశ కలగలేదు.

అయ్యో పాపం ఎవరి డబ్బు ఇది అనుకున్నాడు.చుట్టు పక్కల ఉన్న వారిని వాకబు చేశాడు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ సంచిని ఎలాగైనా దాని ఓనర్‌ వద్దకు చేర్చాలని ఆశ పడ్డాడు.చాలా మందిని అడుగుతూ ఉన్నాడు.

Advertisement

ఇక పోలీసులకు ఆ బ్యాగ్‌ను అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.ఆ సమయంలోనే ఒక వ్యక్తి కంగారుగా తన బ్యాగ్‌ పోయింది అంటూ వచ్చాడు.

అప్పుడు జగ్దాలే తన వద్ద ఉన్న బ్యాగ్‌ను చూపించి ఇదేనా అన్నాడు.అప్పుడు ఆయన ఔను ఇదే నా బ్యాగ్‌, అందులో 40 వేల రూపాయలు ఉన్నాయి.

నా భార్యకు ఆపరేషన్‌ కోసం తీసుకు వెళ్తున్నాను అన్నాడు.

40 వేల రూపాయల బ్యాగ్‌ ఇచ్చినందుకు జగ్దాలేకు ఆ వ్యక్తి వెయ్యి రూపాయలు ఇవ్వబోయాడు.కాని ఆ డబ్బు వద్దన్న జగ్దాలే తనకు ఒక 10 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరాడు.ఆ డబ్బుతో తాను తన సొంత ఊరుకు వెళ్లాలనుకుంటున్నట్లుగా చెప్పాడు.

జగ్దాలే విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.ఆయనకు ఆర్థిక సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు.

ఒకసారి ఎమ్మెల్యే పిలిపించి మరీ సాయం చేస్తానంటూ అడిగాడు.కాని జగ్దాలే మాత్రం సాయంకు ఒప్పుకోలేదు.

ఇటీవలే ఒక ఎన్నారై ఏకంగా అయిదు లక్షల రూపాయలను ఇస్తానంటూ ముందుకు వచ్చాడు.వాటిని కూడా వదులుకున్నాడు.

మొత్తంగా 20 లక్షల వరకు సాయంను జగ్దాలే తృణప్రాయంగా వదిలేసుకున్నాడు.అందుకే ఈయన ఒక గొప్ప వ్యక్తి అంటూ స్థానికులు అంటున్నారు.

ఇప్పుడు వైరల్‌ అవ్వడంతో ప్రపంచం మొత్తం ఆయన్ను గొప్ప వ్యక్తి అంటోంది.

తాజా వార్తలు