మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్న మహానటి

తెలుగులో నాగ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన చిత్రం మహానటి.

కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి మరోసారి సావిత్రిని కళ్ళముందు చూపించింది.

ఆమెని కేవలం సినిమా నటిగానే చూసిన తెలుగు ప్రేక్షకులకి, సావిత్రి జీవితంలో మరో విషాదకర కథనాన్ని దర్శకుడు నాగ అశ్విన్ హృద్యంగా తెరపై ఆవిష్కరించారు.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ మహానటి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి ప్రాణం పోసింది.

దీంతో కీర్తి సురేష్ ఈ సినిమాతో అభినవ మహానటి అనే గుర్తింపుని తెచ్చేసుకుంది.సావిత్రిని మరోసారి గుర్తు చేసిన కీర్తి సురేష్ ని తెలుగు సినీ ప్రముఖులు ఆకాశానికి ఎత్తేసారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా చాలా అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శితం అయ్యింది.ఇక తాజాగా మరో అరుదైన గుర్తింపుని ఈ సినిమా సొంతం చేసుకుంది.

Advertisement

తాజాగా ప్రకటించిన జాతీయ ఉత్తమ చిత్రాల కేటగిరీలో జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా మహానటి సినిమా నిలిచింది.దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఉత్తమ చిత్రాల అవార్డులు ప్రకటనలో మహానటి సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచి అరుదైన గౌరవం సొంతం చేసుకుంది.

మొత్తానికి సావిత్రి జీవితానికి ఈ జాతీయ అవార్డుతో గొప్ప గౌరవం దక్కిందని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు