ఆర్టికల్ 370 రద్దుకి పాకిస్తాన్ లో అనూహ్య మద్దతు

పాకిస్తాన్ స్వయం ప్రతిపత్తి అధికారాలని తొలగిస్తూ ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం ఊహించని విధంగా రద్దు చేసింది.ఇక దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేసింది.

దీంతో ఇక కాశ్మీర్ మూడు కేంద్ర ప్రాలిత ప్రాంతాలుగా దేశంలో అంతర్బాగాలుగా ఉంటాయి.అలాగే కాశ్మీర్ లో కూడా మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ప్రజలకి హక్కులు ఉంటాయి తప్ప అదనంగా ఎలాంటి హక్కులు ఉండవు.

దీనిని ప్రస్తుతం దేశ యావత్తు మద్దతు ఇస్తుంది.కొంత మంది షో కాల్డ్ కమ్యూనిస్ట్ లు, లౌకికవాదులు తప్ప దేశంలో అందరూ ఆర్టికల్ 370 రద్దుని అందరూ ఒప్పుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు దీనిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం కారణంగా పాకిస్తాన్ ఓ వైపు అట్టుడికిపోతుంది.భారత్ అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించింది అంటూ గగ్గోలు పెడుతుంది.

Advertisement

మరో వైపు ఏ క్షణం అయిన యుద్ధానికి వెళ్తాం అంటూ దేశ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లోని కొందరు వ్యక్తులు మాత్రం మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.

భారత్‌కు మద్దతుగా తమ అభిప్రాయాలను బ్యానర్లపై ముద్రించారు.మహా భారత్‌కు ముందడుగు అంటూ, శివసేన ఎంపీ వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్‌ను ముద్రించి వాటిని ఇస్లామాబాద్ వీధుల్లో ఏర్పాటు చేశారు.

ఆక్రమిత కశ్మీర్ తర్వాత భారత్ బలూచిస్తాన్, ఆజాద్ కశ్మీర్‌ను పాక్ నుంచి తీసేసుకుంటుందని అందులో రాశారు.ఈ బ్యానర్లు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో ఆ బ్యానర్ లని పాక్ పోలీసులు తొలగించి వాటిని ఏర్పాటు చేసిన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!

Advertisement

తాజా వార్తలు