ఆవు, ఎద్దుల ప్రేమ.. చూడటానికి రెండు కళ్ళు చాలవు..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్ కనీసం.మనసుకి దగ్గరైన మనిషిని కూడా దగ్గర తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సామాజిక దూరం కీలకంగా మారింది.మనుషుల మధ్య దూరం పెరుగుతోంది.

మనుషులనే కాదు కరోనా వైరస్ ప్రభావం మూగజీవాలను కూడా దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఏకంగా అప్పటి వరకు కలిసి ఉన్న మూగజీవాలు విడిపోవడంతో ఎంతగానో తల్లడిల్లిపోయాయి.

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని పాలమేడు లో జరిగింది.కరోనా వైరస్ ప్రభావం కారణంగా పాలమేడు కు చెందిన ఓ రైతును ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.

Advertisement

దీంతో చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న అవును పక్క గ్రామం రైతుకు విక్రయించాడు.కానీ మూగజీవాల మధ్య ఉన్న ప్రేమను మాత్రం ఆ రైతు అర్థం చేసుకోలేకపోయాడు.

ఈ క్రమంలోనే ఆ అవును తీసుకెళ్లడానికి వాహనం వచ్చింది.వాహనంలో ఎక్కించారు.

కానీ ఇన్ని రోజుల నుంచి తనతో పాటు కలిసి ఉన్న ఆవు దూరమై పోతుందని ఆ ఎద్దు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయింది.దీంతో అవును తీసుకెళుతున్న వాహనాన్ని ఎంతోసేపు అడ్డుకునేందుకు ప్రయత్నించింది.

అయినప్పటికీ వాహనం ముందు వెళ్లిపోవడంతో కొద్దిదూరం పాటు ఆ అవును చూస్తూ వాహనం వెనకాలే పరుగులు పెట్టింది ఎద్దు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ గా మారిపోయింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

కేవలం మనుషుల మధ్య కాదు మూగ జీవాల మధ్య కూడా ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది అని ఈ వీడియో అందరికీ అర్థం అయ్యేలా చేస్తుంది.ఇక ఈ విషయం తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు జయ ప్రదీప్ వరకు వెళ్లడంతో.

Advertisement

వెంటనే ఆవును మళ్లీ రైతు దగ్గరికి వచ్చేలా చేశాడు.మళ్లీ ఆ ఆవు, ఎద్దు ఒక్కటయ్యాయి.

దీంతో స్థానికులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు