తమిళనాడు అమ్మాయి.. అమెరికా అబ్బాయి : ఆన్‌లైన్‌లో పెళ్లికి మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

మద్రాస్ హైకోర్ట్ మధురై బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది.తమిళనాడుకు చెందిన మహిళ వర్చువల్‌ మోడ్‌లో భారత సంతతికి చెందిన అమెరికన్ జాతీయుడిని వివాహం చేసుకోవడానికి కోర్ట్ అనుమతించింది.

 Madras High Court Gives Green Signal For Virtual Wedding Of Indian Woman, Us Man-TeluguStop.com

దీంతో ఆమె పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయింది.వివాహం చేసుకోవడం ప్రాథమిక మానవ హక్కు అని.ప్రత్యేక వివాహం చట్టం 1954లోని సెక్షన్‌ 12, 13 ఈ హక్కును తెలియజేస్తుందని జస్టిస్ జీఆర్ స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.చట్టంలోని సెక్షన్ 12 (2) ప్రకారం.

ఏ రూపంలోనైనా వివాహాన్ని జరుపుకోచ్చని ఆయన అన్నారు.దీంతో పిటిషన్‌దారు ఆన్‌లైన్ మోడ్‌ను ఎంచుకున్నారు.

భారత సంతతి అమెరికన్ అయిన రాహుల్ ఎల్ మధుతో తన వివాహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేందుకు కన్యాకుమారి సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలని వాస్మి సుదర్శిని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అలాగే తమ వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద రిజిస్టర్ చేసి వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఆమె కోరింది.

దీనిని విచారించిన జస్టిస్ స్వామినాథన్ బెంచ్.ముగ్గురు సాక్షుల సమక్షంలో వర్చువల్ మోడ్‌లో రాహుల్ ఎల్ మధుతో పిటిషనర్‌ వివాహం వైభవంగా నిర్వహించాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

వివాహానికి ఇరుపక్షాలు తప్పనిసరిగా భారతీయ పౌరులుగా వుండాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

Telugu Gr Swaminathan, Madrasgreen, Maduraibench, Rahul Madhu-Telugu NRI

ఇకపోతే.పిటిషనర్‌కు రాహుల్ ఎల్ మధు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ వుంది.వివాహం అనంతరం.

సుదర్శిని.మధు తరపున వివాహ ధృవీకరణ పత్రంలో, రిజిస్ట్రార్ ఆఫీసులోని రిజిస్టర్‌లో సంతకం చేసేందుకు కోర్టు అనుమతించింది.

అనంతరం ఆమెకు చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం వివాహ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు.కన్యాకుమారికి చెందిన సుదర్శిని, అమెరికాకు చెందిన రాహుల్ మధు ప్రేమించుకున్నారు.

అనంతరం పెళ్లి చేసుకోవాలనుకున్నారు.అయితే రాహుల్ అమెరికాలో వుండగా.

సుదర్శిని భారత్‌లో వున్నారు.దీంతో కోర్టు అనుమతి మేరకు ఇరు కుటుంబాల వారు ఆన్‌లైన్ (డిజిటల్ పద్ధతి) వివాహం చేయ‌డానికి సిద్ధమ‌య్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube