ఆ పెట్రోల్ బంక్ లో రూ.40 కి పైగా డిస్కౌంట్.. ఎక్కడో తెలుసా?

కొన్ని పరిస్థితులు కారణంగా దేశంలోని అన్నీ వస్తువుల పై ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా చెప్పాలంటే ముడి చమురు.

 Madhya Pradesh Congress Providing Petrol At 40rs Discount In Indore Details, Pet-TeluguStop.com

అంటే పెట్రోలు, డీజిల్ మొదలగు వస్తువుల పై ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగడం వల్ల మిగిలిన వస్తువులు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

వరుస బాదుడులతో ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ హై కి చేరుతున్నాయి.మొన్న జరిగిన రష్య-ఉక్రెయిన్ ల మధ్య జరిగిన యుద్ధం కారణంగా ధరలు మరింత పెరిగాయి.

అదే విధంగా వంట నూనెల ధరలు కూడా ఆకాశానికి నిచ్చెనలు వేసాయి.ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాఖ వినూత్నంగా నిరసన చేపట్టింది.

ట్యాక్సులు లేకుండా పెట్రోల్‌ అసలైన ధర ఎంతో యువతకు తెలిపేందుకు ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఒక పెట్రోల్ బంకును ఎంచుకుని అక్కడ ఒక గంట పాటు 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువకులకు రూ.60 రూపాయలకే పెట్రోల్ పోసింది.దీంతో అక్కడకు యువత క్యూ కట్టింది.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న పరశురామ్ వాటిక సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువకులకు రూ.60 రూపాయలకే పెట్రోల్ పోస్తుండడంతో.అక్కడ తోపులాట జరిగింది.దీంతో పోలీసులు మొహరించి ఒక్కొక్కరికీ టోకెన్లు ఇచ్చి పంపారు.పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాఖ ఈ విధంగా తమ నిరసనను వ్యక్తం చేసింది.రూ.60కే పెట్రోల్ పోయించుకున్న వారి బైక్‌లపై ధరల గురించిన పోస్టర్లు అంటించింది.

Telugu Fuel Discount, Indore, Madhyapradesh, Petrol, Petrol Bank, Soical Meida,

ఎంపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రమోద్ ద్వివేది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.`పెట్రోల్ అసలు ధర రూ.60 మాత్రమే.ఒక్క లీటర్ పెట్రోల్‌పై ఎంత పన్ను కడుతున్నామో యువత గుర్తించాలి.ఈ పన్నుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగింది.అన్ని వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.కేంద్రం ప్రజలను ఎలా దోచుకుంటోందో యువకులు గమనించాల`ని ద్వివేది అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube