ఈ వైసీపీ మంత్రులు చేసిన ఒక్క మంచి పని చెప్పండి.. మాధవీలత కామెంట్స్ వైరల్!

మాధవీలత( Actress Madavi Latha ) హీరోయిన్ గా సంపాదించుకున్న గుర్తింపు కంటే వివాదాల ద్వారా సంపాదించుకున్న గుర్తింపు ఎక్కువనే సంగతి తెలిసిందే.ఎన్నికల నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మాధవీలత వైసీపీ మంత్రులను( YCP Ministers ) టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు.

 Madhavi Latha Comments About Ap Ministers Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

కొడాలి నాని( Kodali Nani ) పనితీరు ఎలా ఉంది అనే ప్రశ్నకు ఆయన బూతుల నానినేనా అని మాధవీలత అన్నారు.రౌడీయిజం చేసే వ్యక్తిని అసెంబ్లీలో కూర్చోబెట్టారంటే యువత చేసిన తప్పు అని ఆమె తెలిపారు.

నాని లాంటి వ్యక్తులను చూసి ఒకప్పుడు పాలిటిక్స్( Politics ) అంటే మరోలా అభిప్రాయం ఉండేదని మాధవీలత అన్నారు.భాష, వ్యవహారం సరిగ్గా ఉండవని ఆమె అన్నారు.

ఎవరైనా కొంటే బీచ్ కూడా అమ్ముతారని మాధవీలత తెలిపారు.ఇలాంటి వాళ్లను ఎమ్మెల్యేగా ఎంచుకున్న ప్రజల తప్పు అని ఆమె కామెంట్లు చేశారు.

చేతిలో ఓటు అనే ఆయుధం ఉందని ఆ ఆయుధాన్ని వినియోగించుకోవాలని మాధవీలత పేర్కొన్నారు.మంచి లీడర్ ను ఎంచుకుంటే మంచి ఓటర్లు అవుతారని ఆమె తెలిపారు.ఇరిగేషన్ మినిష్టర్ అనగానే సంజన( Sanjana ), సుకన్య గుర్తుకు వస్తాయని మాధవీలత తెలిపారు.రైతులకు ఆయన ఏం చేశారని మాధవీలత ప్రశ్నించారు.రైతు( Farmers )లు కూడా అడగాలి కదా అని ఆమె అన్నారు.ఏపీలో ఉన్న భూమి, పంట పొలాలు దేశంలో ఎక్కడా లేవని మాధవీలత తెలిపారు.

రోజాగారిపై నేను కామెంట్స్ చేయలేదని ఆమె అన్నారు.

రోజా( Minister Roja ) టూరిజంను ఎంత అభివృద్ధి చేశారని ఆమె కామెంట్లు చేశారు.వైసీపీకి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని మరి కేంద్రం సహాయంతో డెవలప్ చేయొచ్చు కదా అని మాధవీలత అన్నారు.గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) పేరు చెప్పగానే కోడిగుడ్డు మినిష్టర్ అని ఆమె తెలిపారు.

మాధవీలత చేసిన కామెంట్లు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube