ఈ ఏడాది హిట్టైన సాంగ్ ఏదనే ప్రశ్నకు కుర్చీ మడతబెట్టి సాంగ్( Kurchi Madathapetti Song ) పేరు సమాధానంగా వినిపిస్తుందనే సంగతి తెలిసిందే.గుంటూరు కారం సినిమాలోని ఈ సాంగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది.
వ్యూస్ పరంగా కూడా ఈ సాంగ్ అదరగొట్టిందనే సంగతి తెలిసిందే.కుర్చీ సాంగ్ కు ఏకంగా 158 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఈ సాంగ్ ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే నేషనల్ గేమ్స్ మధ్యలో సైతం కుర్చీ సాంగ్ ను ప్రసారం చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.మహేష్ బాబు క్రేజ్ కు ఇదే సాక్ష్యం, నిదర్శనం అని నెటిజన్లు చెబుతున్నారు.
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మ్యాచ్( National Basketball Association Match )) మధ్యలో ఈ సాంగ్ ను ప్లే చేయగా అక్కడ ఉన్నవాళ్లు ఈ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు.మహేష్ సినిమాలలో మాస్ సాంగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయని నెటిజన్లు చెబుతున్నారు.
గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )కు భారీగా కలెక్షన్లు రావడానికి ఈ సాంగ్ కూడా కారణమని చాలామంది ఫీలవుతారు.గుంటూరు కారం సినిమా థియేటర్లలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాకపోయినా ఓటీటీలో మాత్రం ఎక్కువ సంఖ్యలో భాషల్లో విడుదలై అదరగొట్టిందనే చెప్పాలి.గుంటూరు కారం సాంగ్స్ ఘాటు మామూలుగా లేదని నెటిజన్లు చెబుతున్నారు.