కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ కీ ఘనంగా స్వాగతం పలికిన మచిలీపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డా.
సింహాద్రి చంద్రశేఖర్ మచిలీపట్నంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులైన డా.సింహాద్రి చంద్రశేఖర్ ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు.దీంతో ఆయన మచిలీపట్నం వచ్చారు.
తొలిసారి మచిలీపట్నం వచ్చిన సింహాద్రి చంద్రశేఖర్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుతో కలిసి మూడు స్థంభాల సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.
నగర ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీ సాగగా వేలాది మంది కార్యకర్తలు పాల్గొని జేజే నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.