'మాచర్ల' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఒకరకంగా ఓపెనింగ్స్ కుమ్మేసింది!

నితిన్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు అవుతుంది.ఈ 20 ఏళ్లలో ఎన్నో హిట్ సినిమాలు మరెన్నో ప్లాప్ సినిమాలను కూడా చూసాడు.

 Macherla Niyojakavargam' Box Office Collections Day 1 , Nithiin, Macherla Niyojakavargam, Director Rajasekhar Reddy,krithi Shetty,catherine Tresa-TeluguStop.com

నితిన్ ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.అయితే గత రెండు మూడు సినిమాలు నితిన్ ను నిరాశ పరిచాయి.

అందుకే ఈసారి మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తాజాగా ఈయన నటించిన మాచర్ల నియోజక వర్గం రిలీజ్ కు రెడీ అవుతుంది.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ అయ్యింది.నితిన్ కెరీర్ కు ఈ సినిమా కీలకంగా మారింది.మరి అలాంటి సినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.మరి అలాంటి సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో చూడాలి.

ఈ సినిమా వసూళ్లు ఏరియాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే.నైజాం 1 కోటి 42 లక్షలు, సీడెడ్ 76 లక్షలు, కృష్ణ 30 లక్షలు, వైజాగ్ 69 లక్షలు, వెస్ట్ గోదావరి 22 లక్షలు, ఈస్ట్ గోదావరి 46 లక్షలు, గుంటూరు 55 లక్షలు, నెల్లూరు 26 లక్షలు కలెక్ట్ చేయగా.

కర్ణాటక 18 లక్షలు, రెస్టాఫ్ ఇండియా 97 లక్షలు కలెక్ట్ చేసింది.ఇలా మొత్తంగా చుస్తే ఈ సినిమా ఫస్ట్ డే 4.96 కోట్లు రూపాయల షేర్ రాబట్టింది.

నితిన్ కెరీర్ లో ఇది మంచి ఓపెనింగ్ అనే చెప్పాలి.

టైర్ హీరోల్లో ఒకరైన నితిన్ ఓపెనింగ్స్ లో దాదాపు 5 కోట్లు రాబట్టారు అంటే ఇది మంచి విషయంగా భావించాలి.మరి ఈ వీకెండ్ కూడా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

చూడాలి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అవుతుందో.లేదంటే ప్లాప్ అవుతుందో.

Telugu Catherine Tresa, Krithi Shetty, Nithiin-Movie

ఇక ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తుండగా.కృతి శెట్టి, క్యాథరిన్ త్రేస్సా హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.ఈ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube