లక్కున్నోడు మూవీ రివ్యూ

చిత్రం : లక్కున్నోడు

 Luckkunnodu Movie Review-TeluguStop.com

బ్యానర్ : ఎమ్.వి.

వి.సినిమా

దర్శకత్వం : రాజ కిరణ్

నిర్మాతలు : ఎమ్.వి.వి.సత్యనారాయణ

సంగీతం : విజయ్ కుమార్

విడుదల తేది : జనవరి 26, 2017

నటీనటులు : మంచు విష్ణు, హన్సిక

ఢీ అనే సినిమా తన కెరీర్ లో తొలి హిట్ గా నిలవడంతో, అలాంటి కామెడీ జానర్ సినిమాల తన కెరీర్ నడిపిస్తున్నాడు మంచు విష్ణు.ఈ ప్రయాణంలో ఒకటి రెండు హిట్స్ తగిలాయి అలాగే దారుణమైన పరాజయాలు కూడా చూడాల్సివచ్చింది.

మరి అదే వరుసలో వచ్చిన “లక్కున్నోడు” ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళితే :

కరెన్సీ నోట్ల దొంగతనంతో సినిమా మొదలవుతుంది
లక్కి (మంచు విష్ణు) పేరుకి మాత్రమే లక్కి.కాని అంతా రివర్స్ జరుగుతూ ఉంటుంది.తన బ్యాడ్ లక్ వలన మిగితావారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.అసలు సూసైడ్ చేసుకుందామనుకున్న లక్కి, పద్మ (హన్సిక) ని చూసి ప్రేమలో పడతాడు.కొంతసేపు వీరిద్దరి ఆటపాట తరువాత హీరో లక్ మారిపోతుంది.

అదే ట్విస్టు.

ఆ డబ్బుల గొడవ ఏంటి ? దానికి మన హీరోకి సంబంధం ఏంటి ? ఎలాంటి చిక్కుల్లో పడ్డాడో సినిమాలో చూడండి.

నటీనటుల నటన :

ఏముంది .మరో టిపికల్ సినిమా.మరోసారి మంచు విష్ణు అదే మాదిరిగా కామెడి టైమింగ్ కోసం ప్రయాస చేస్తూ కనిపించాడు.అక్కడక్కడ పెలతాడు, అక్కడక్కడ తుస్సుమంటాడు.డ్యాన్సులు ఉన్నాయంటే ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయంటే ఉన్నాయి.హన్సిక డబ్బింగ్ చాలా ఎబ్బెట్టుగా ఉంది.

చెప్పాలంటే, తన హావాభావాలకి డబ్బింగ్ ఓవర్ యాక్షన్ లెవెల్స్ పెంచింది అంతే.

విలన్ల కరువు నిజంగానే ఉండటంతో, ఈ సినిమా కోసం నిర్మాత ఎమ్.వి.వి తానే విలన్ గా మారిపోయారు.చాలా అంటే చాలా ఇరిటేటింగ్ పాత్ర ఇది, నటన కూడా.సత్యం రాజేష్, పోసాని, మిగితా బ్యాచ్ తమ వంతుగా నవ్వించే ప్రయత్నం చేసారు.

టెక్నికల్ టీమ్ పనితనం :

చెప్పుకునేంత గొప్పగా ఎవరు పనిచేయలేదు.సంగీతం, సినిమాటోగ్రాఫీ, ఎడిటింగ్, ఏ డిపార్టుమెంటుకి కూడా తమ మార్కు అందించే అవకాశం కథ ఇవ్వలేదు.

విశ్లేషణ :

లక్కులేని హీరో, అతని బ్యాడ్ వలన ఇబ్బంది పడే కామెడియన్లు .ఈ తతంగం నడుస్తున్నప్పుడు హీరోయిన్ కనబడటం, హీరో పాట పాడటం, వెంట పడటం, ఇంటర్వెల్ లో ప్రేక్షకుల ముఖాన ఓ ట్విస్ట్ పడేయటం .ఇక్కడినుంచైనా సినిమాలో ఏదైనా మార్పు ఉంటుందేమో అని అత్యాశపడి, నిరాశలోకి, నిద్రలోకి ప్రేక్షకుడు వెళ్ళిపోవడం.ఇలాంటి సినిమాలు ఎన్నో చూశాం తెలుగులో, సరిగ్గా అలాంటి సినిమా ఇది.

చివరగా :

సినిమా ఆడాలంటే చాలా లక్కు కావాలి

తెలుగుస్టాప్ రేటింగ్ : 1.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube