ఇకపై LPG గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీగానే డెలివరీ చేయబడుతుంది… ప్రజలు ఈ విషయాన్ని గమనించండి!

గ్యాస్ సిలెండర్ డెలివరీ పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం కంకణం కట్టుకోంది.గ్యాస్ డీలర్లు వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో AP రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం అనగా జనవరి 30న ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

 Lpg Gas Cylinder Free Delivery Upto 5 Km Range-TeluguStop.com

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోపు గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదనేది దాని సారాంశం.

Telugu Km, Ap, Cylinders, Delivery, Delivery Boy, Fine, Cost-Latest News - Telug

అయితే 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల మేర దూరం ఉంటే రూ.20లు, గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కిలోమీటర్లు దాటితే ఒక్కో సిలెండర్‌కు రూ.30ల చొప్పున వసూలు చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా నిర్ణయించింది.ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఇకనుండి 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సినవసరం లేకుండా.సిలెండర్ రసీదులో ఉన్న రేటు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రజలకు AP ప్రభుత్వం సూచించింది.

Telugu Km, Ap, Cylinders, Delivery, Delivery Boy, Fine, Cost-Latest News - Telug

అవును, ఇకనుండి కస్టమర్లు 5 కిలోమీటర్ల లోపు ఉంటే కనుక సిలెండర్ డెలివరీ కోసం ప్రభుత్వం నిర్ణించిన నిర్ణీత రుసుము చెల్లిస్తే సరిపోతుంది.ఈ విషయంలో డెలివరీ ఏజెంట్లు డబ్బులు వసూలు చేయాలనీ చూస్తే మాత్రం పిర్యాదులు చేయవచ్చని కూడా సూచించింది.సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు లేదా జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా సేల్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ తాజా ప్రకటనలు చెప్పుకొచ్చారు.LPG వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్‌ 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లలో లేదా ఆయిల్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ 1800233555కు ఫిర్యాదు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube