పంజాబ్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్య ఒంటరితనమే కారణం

పంజాబ్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.అనంతపురం జిల్లా కు చెందిన వెంకట భరత్ కుమార్(20) అనే విద్యార్థి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో ఎలక్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో బీటేక్ చదుతున్నాడు.

అయితే ఒంటరితనాన్ని భరించలేకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని,తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.

పంజాబ్ లో తెలుగు విద్యార్థి ఆ

శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడుఆత్మహత్యకు ముందు భరత్ కుమార్ తాను చనిపోతున్నానంటూ ఒక లేఖ రాసి దాన్ని ఫొటో తీసి స్నేహితుడికి కూడా పంపించాడు.అయితే అది చూడగానే పాపం స్నేహితుడు మిగతా మిత్రులతో కలిసి క్యాంపస్ మొత్తం వెతకగా హాస్టల్ బిల్డింగ్ పక్కన రక్తపు మడుగులో కనిపించినట్లు తెలుస్తుంది.

అయితే హుటాహుటిన భరత్ ను యూనివర్సిటీ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే భరత్ కుమార్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పంజాబ్ లో తెలుగు విద్యార్థి ఆ

ఫగ్వారా పోలీస్ ఠాణా అధికారి ఓంకార్ సింగ్ వివరాలు వెల్లడిస్తూ, అతడు రాసిన లేఖలో ఒంటరితనం గురించి ప్రస్తావించాడని,ప్రస్తుతానికి మృతుడి గదికి సీల్ వేసిన అధికారులు, మృతుడి కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత వారి సమక్షంలోనే తలుపులు తెరచి విచారణ జరపనున్నట్లు సమాచారం.భరత్ స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గుడిపాడు.ఆ కుటుంబం ప్రస్తుతం తాడిపత్రిలో నివాసం ఉంటోంది.భరత్ తండ్రి శ్రీనివాసులు నాపరాళ్ల వ్యాపారం చేస్తుంటారు.ఆయన ముగ్గరు కుమారుల్లో భరత్ ఆఖరివాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube