ప్రపంచ దేశాల నుండి పర్యటకులను ఆకర్షించేందుకు దుబాయి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.ఎప్పటికప్పుడు కొత్త కొత్త అద్బుతాలను సృష్టిస్తూ అక్కడి వారు విదేశీయులను ఆకర్షిస్తూ ఉంటారు.
దుబాయికి వచ్చే పర్యటకుల సంఖ్య భారీగా పెరుగుతున్న సమయంలో దేశంలో చెత్త కూడా పేరుకు పోవడంను అక్కడి అధికారులు మరియు పాలకులు సీరియస్‌గా తీసుకున్నారు.అందుకే వచ్చే పర్యటకుల కోసం కాకున్నా వారికోసం అయినా దేశంను నీట్‌గా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

చెత్త ఎక్కడ కూడా కనిపించకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు.ఇక కార్ల విషయంలో దుబాయి వాసులు చాలా అశ్రద్దగా ఉంటారు.ఒక్కో ఇంట్లో రెండు మూడు కార్లు ఉంటాయి.దాంతో వాటిని క్లీన్ చేయడం వారి వల్ల కాదు.నెలకు లేదా రెండు నెలలకు ఒక సారి చొప్పున కార్లను క్లీనింగ్‌కు ఇస్తారు.దాంతో అప్పటి వరకు కార్లు చాలా డర్టీగా తయారు అవుతున్నాయి.
వాటిని చూస్తేనే బాబోయ్ అన్నట్లుగా ఉంటున్నాయి.అందుకే స్థానిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రోడ్డుపై మురికితో ఉన్న కారు కనిపిస్తే 500 దిర్హామ్ లు అంటే ఏకంగా 9 వేల రూపాయలు జరిమానా విధిస్తారన్న మాట.జరిమానా కట్టకుంటే కారును సీజ్ చేసే అవకాశం కూడా ఉంది.సీజ్ అయిన కారును విడిపించుకునేందుకు మరో రెండు వందల దిర్హామ్ లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.ఈ కొత్త పద్దతిని దేశం బాగు కోసం, దేశం పరువు పోకుండా ఉండటం కోసం అమలు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
అయితే స్థానికులు మాత్రం ఈ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు.






