లవ్ స్టోరీ క్లైమాక్స్.. ఒకటి కాదు రెండు!

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘లవ్ స్టోరి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు మరోసారి శేఖర్ రెడీ అవుతున్నాడు.

 Love Story To Have Two Climax-TeluguStop.com

ఇక ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ విషయంలో చిత్ర వర్గాల్లో ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో శేఖర్ కమ్ముల ఒకటి కాదు రెండు క్లైమాక్స్‌లను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

 Love Story To Have Two Climax-లవ్ స్టోరీ క్లైమాక్స్.. ఒకటి కాదు రెండు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో ఒకటి హ్యాపీ ఎండింగ్‌ను క్లైమాక్స్‌గా పెట్టగా, మరోటి విషాదంతో కూడిన క్లైమాక్స్‌ను పెట్టాడట.దీంతో ఈ రెండింటింలో దేనిని క్లైమాక్స్‌గా ఫైనల్ చేస్తారా అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది.

చిత్ర యూనిట్‌కు కూడా ఈ సినిమా క్లైమాక్స్ ఏమిటనేది తెలియదంటే శేఖర్ కమ్ముల ఈ సినిమాను ఎంత గోప్యంగా ఉంచుతున్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవిల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ పూర్తి ధీమాగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో రెండు సామాజిక అంశాలను కూడా టచ్ చేస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాలో ఎలాంటి అంశాలను మనకు చూపించనున్నారా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

#Love Story #Naga Chaitanya #Sekhar Kammula #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు