ఆ ఆపరేషన్ తర్వాత భరించలేని నొప్పి.. ప్రియాంక అనుభవం?

జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అడుగుపెట్టిన ప్రియాంక అలియాస్ సాయి తేజ పరిచయం గురించి అందరికి తెలిసిందే.

చూడడానికి అచ్చం అమ్మాయిల ఉండడమే కాకుండా ఎంతో అందంగా ఉంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ఇక మొదట్లో జబర్దస్త్ కోసం లేడీ గెటప్ లో వచ్చిందని అనుకున్నారు.కానీ గతంలో తన గురించి చెప్పుకుంటూ తను సర్జరీ చేయించుకున్నానని తెలిపింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆపరేషన్ తర్వాత భరించలేని నొప్పి గురించి కొన్ని అనుభవాలను పంచుకుంది.ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమౌతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్నది ప్రియాంక.

తన మొదటి పరిచయంతోనే బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక హౌస్ లో ఉన్న వాళ్ళందరితో సన్నిహితంగా ఉంటూ వారితో మరింత పరిచయం పెంచుకుంది.

Advertisement

అంతేకాకుండా ఒక అమ్మాయికి ఉండే పద్ధతి లక్షణాలు అన్ని ప్రియాంక లో కనిపిస్తున్నాయి.

మొదటి రెండు రోజు ఎపిసోడ్ లలో చాలా వరకు సున్నితంగా కనిపించింది ప్రియాంక.ఇక మూడో ఎపిసోడ్ లో కొందరు కంటెస్టెంట్ ల దగ్గర కూర్చొని తన ట్రాన్స్ జెండర్ గా మారిన విషయాన్ని తెలిపింది. ట్రాన్స్ జెండర్ గా మారకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటే.

తనను తాను మోసం చేసుకోవడం అని, మరో అమ్మాయికి అన్యాయం చేయాల్సి వచ్చేదని అంటూ తన స్నేహితురాలు నిషా అనే అమ్మాయితో చెప్పుకుందట.

ఇక తన స్నేహితురాలు కూడా వెంటనే పదవే.నేను కూడా వస్తా ఆపరేషన్ చేయించుకోవడానికి అని చెప్పేసరికి ఆ ఒక్క రాత్రిలోనే తాము నిర్ణయం తీసుకున్నారట.వెంటనే ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నామని తెలుపుతూ ఆపరేషన్ తర్వాత చాలా బాధపడ్డానని తెలిపింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అంతేకాకుండా భరించలేని నొప్పి అంటూ నరకం చూశాను అంటూ.తన ఒంట్లో నరాలన్నీ మిక్సీలో వేసినట్టు అనిపించింది అని ప్రియాంక తన బాధలను తెలుపుకుంది.

Advertisement

తాజా వార్తలు