టాలీవుడ్ నటి తాప్సీ గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో అభిమానుల మనసులు దోచుకున్న ఈ సొట్టబుగ్గల బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించింది.
అంతే కాకుండా తన నటనతో మంచి గుర్తింపు పొందింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను, విడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
2010 తెలుగు లో ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత 2011లో బాలీవుడ్ లో అడుగు పెట్టగా అక్కడ కూడా తన నటనతో మెప్పించింది.
అంతేకాకుండా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తన నటన తో అభిమానులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే తాప్సీ ఏ పాత్రలోనైనా చురుకుగా పాల్గొంటుంది.ప్రస్తుతం తాప్సీ నటిస్తున్న చిత్రం ‘లూప్ లపేటా‘.ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కనుంది.
ఇక ఇందులో తాప్సీ నటించే రొమాంటిక్ సీన్లలో తన ఎనర్జీ, కెమిస్ట్రీ గురించి హీరో తాహిర్ రాజ్ బాసిన్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.తాప్సి ఒక్క సారి స్క్రిప్టును లాక్ చేసిందంటే దానికి కట్టుబడి ఉంటుందని, ఈ సినిమాలో సత్య సావి పాత్రల మధ్య ఎక్కువ ఎనర్జీ రొమాంటిక్ సీన్లు ఉన్నాయని తెలిపాడు.
ఇక ఈ సీన్లలో తాప్సి ఎనర్జీ మాటల్లో చెప్పలేమంటూ, ముఖంపై చిరునవ్వు జరగకుండా బెడ్ రూమ్ సీన్ లలో నటించిందని తెలిపాడు.గోవాలో జరిగిన కొన్ని సన్నివేశాల్లో మాటల్లో చెప్పలేమంటూ, లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఒక రకమైన డిప్రెషన్ ఉంటే అది గోవా ట్రిప్ వల్ల దూరం అయిందని తెలిపాడు.
ఎందుకంటే అక్కడ షూటింగులో తాప్సీతో తనకు కెమిస్ట్రీ బాగా పండిందని చెప్పుకొచ్చాడు.ఇక ఓ ముద్దు సన్నివేశం యాక్షన్ సన్నివేశంలా మురిపించేలా ఉంటుందని తెలిపాడు.