సంగీతం బండరాయినైనా కరిగిస్తుంది అని నానుడి.ఇది కాదనడానికి ఎవరూ సాహసం చేయలేరు.
ఎందుకంటే ఇది నిజం కనుక.అలాగే నాకు సంగీతం అంటే ఇష్టంలేదు అని చెప్పడానికి కూడా ఎవరూ ధైర్యం చేయలేరు.
ఎందుకంటే ఈ భూమిపైన సంగీతం అంటే ఇష్టంలేని మానవుడు అనేవాడు వుండడు అని చెప్పుకోవాలి.ఇక్కడ ముఖ్యంగా యూత్‌కు సంగీతం అంటే విపరీతమైన పిచ్చి వుంటుంది.
ఇక టెక్నాలజీ మారుతున్నకొద్దీ పలు కంపెనీలు సంగీతాన్ని వివిధరూపాల్లో అందిస్తున్నాయి.ఇపుడు సంగీతం కోసం వన్ టు వన్ యాప్‌లను విడుదల చేస్తున్నాయి.
ఇక్కడ కూడా ఇలాంటి యాప్‌లు ఉన్నాయి.వాటి నుండి మీరు ఉచితంగా సంగీతాన్ని వినవచ్చు.సబ్‌స్క్రైబ్ చేయకుండానే సంగీతాన్ని సులభంగా వినగలిగే యాప్‌లు ఏవో ఇపుడు తెలుసుకోండి.
1.Spotify
Spotify అనేది అత్యంత జనాదరణ పొందిన మ్యూజిక్ యాప్.ఈ యాప్ ప్రారంభించిన తర్వాత, కేవలం ఒకే ఒక్క వారంలో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు Spotifyకి కనెక్ట్ కావడం విశేషం.
ప్రస్తుతం దీనికి 20 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు.ఇది 129 రూపాయల ఉచిత, ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీస్ ఆప్షన్లను అందిస్తుంది.
2.Google Play మ్యూజిక్ యాప్

ఆండ్రాయిడ్ వినియోగదారులందరకు Google Play మ్యూజిక్ యాప్ అందుబాటులో ఉంటుంది.ఇది రూ.99 ఉచిత, నెలవారీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ రెండింటిలోనూ సంగీతాన్ని వినడానికి వినియోగదారులకు అందుబాటులో వుంది.దాదాపు 35 మిలియన్ పాటలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
3.YouTube మ్యూజిక్ యాప్

YouTube సంగీతం Google అందించిన 2వ ఉచిత సంగీత యాప్.ఇందులో ఉచిత స్ట్రీమింగ్‌తో పాటు, మీరు ఇందులో మ్యూజిక్ వీడియోలను కూడా చూడవచ్చు.మీరు Google Play సంగీతానికి సబ్‌స్క్రైబర్ అయితే, మీరు YouTube Musicకి ఆటోమేటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు.
4.SoundCloud

SoundCloud అనేది కొత్త కళాకారుల కోసం ఏర్పడిన భారీ స్ట్రీమింగ్ మ్యూజిక్ సర్వీస్ యాప్.ఇందులో మీరు అత్యధికంగా ఇష్టపడిన పాటలను చూడవచ్చును.ప్రస్తుతం, SoundCloud పూర్తిగా ఉచిత సంగీతాన్ని అందిస్తుంది.
5.JioSaavn

JioSaavn యాప్ లో భారతదేశంలోని వివిధ భాషల్లో వున్న దాదాపు 5 కోట్ల పాటలను వినవచ్చు.ఇది ఉచితంతో పాటు, సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు, మధ్యలో మీకు ఎటువంటి ప్రకటనలు కనిపించవు, వినిపించవు.JioSaavn దాని వినియోగదారులకు రూ.299కి ఒక సంవత్సరం ప్రీమియం సభ్యత్వాన్ని అందిస్తుంది.దీని నెలవారీ సబ్స్క్రిప్షన్ కోసం 99 రూపాయలు వసూలు చేస్తారు.