బ్రూనై, మలేషియా పర్యటనకు వీ. మురళీధరన్.. ప్రవాస భారతీయులతో భేటీకానున్న కేంద్ర మంత్రి

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్( MoS V Muraleedharan ) బ్రూనైలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా దారుస్సలాంలో భారతీయ కమ్యూనిటీతో( Brunei Indian community ) ఆయన భేటీకానున్నారు.అంతకుముందు తొలిసారిగా బ్రూనై( Brunei ) వచ్చినందుకు ఆనందంగా వుందని.

ఇక్కడి బిజినెస్ లీడర్స్, ఇండియన్ కమ్యూనిటీ ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నానని మురళీధరన్ ట్వీట్ చేశారు.మే 30 నుంచి జూన్ 2 వరకు కేంద్ర మంత్రి బ్రూనై, మలేషియాల్లో పర్యటించనున్నారు.అధికారిక లెక్కల ప్రకారం.14000 మంది భారతీయులు బ్రూనైలో స్థిరపడ్డారని అంచనా.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) వేడుకల్లో భాగంగా అక్కడి భారతీయ సంఘాలు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

బ్రూనై పర్యటన ముగించుకుని జూన్ 1, 2 తేదీల్లో మురళీధరన్ మలేషియాలో పర్యటిస్తారు.ఈ సందర్భంగా మలేషియా విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ దాతుక్ మొహమ్మద్ బిన్ అలమిన్, ఆ దేశ మానవ వనరుల శాఖ మంత్రి వి.శివకుమార్‌ తదితరులతో మురళీధరన్ భేటీ అవుతారు.తొలుత భారత సంతతి వ్యక్తుల దినోత్సవం (అప్రవాసి దివాస్)లో ఆయన పాల్గొంటారు.

Advertisement

అలాగే జూన్ 2 నుంచి 4 వరకు జరిగే పీఐవో ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌ను మురళీధరన్ ప్రారంభిస్తారు.ప్రవాసీయ భారతీయ ఉత్సవ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు కేంద్ర మంత్రి.2.75 మిలియన్ల మంది భారత మూలాలున్న వ్యక్తులతో మలేషియా పీఐవోలకు సంబంధించి ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా నిలిచింది.

కాగా.విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ .శంకర్ రేపటి నుంచి దక్షిణాఫ్రియా, నమీబియాలలో పర్యటించనున్నారు.తొలుత కేప్‌టౌన్‌లో జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలలో ఆయన పాల్గొంటారు.

అలాగే దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలేడి పండోర్‌తోనూ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొని, ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అవుతారు.దీనితో పాటు ఇతర బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో జైశంకర్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.

ఇదే పర్యటనలో కేప్‌టౌన్‌లోని ప్రవాస భారతీయులతోనూ ఆయన భేటీకానున్నారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు