ఈ రెండు తలల కలిగిన పిల్లిని చూడండి.. ఎంత వింతగా వుందో!

ఏంటీ, రెండు తలల కలిగిన పిల్లేమిటని అనుకుంటున్నారా? నిజమే అండీ.ఇది అల్లాటప్పా పిల్లి కూన కాదు.

 Look At This Cat With Two Heads  How Strange! , 2 Head S Cat , Viral Latest , Ne-TeluguStop.com

ఏకంగా 2 తలలతో పుట్టిన కూన.యెంత విచిత్రంగా ఉందంటే.దీనిని కనీసం ఓ పావుగంట పరీక్షిస్తేగాని అది పిల్లని మనకు తెలియదు.ఇక ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటలు మాత్రమే జీవించగలవు.కానీ ఆదివారం థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం నిస్సందేహంగా బతికేసింది.పైగా ఆ 2 మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ దాని యజమాని తెగ మురిసిపోతున్నాడు.

దీనికి టుంగ్‌ గ్రెన్‌ (వెండి బ్యాగు), టుంగ్‌ టోంగ్‌ (బంగారు బ్యాగు) అని ఏకంగా 2 పేర్లు పెట్టుకున్నాడండీ.అంటే ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట.

అయితే దీని తల్లి ముందుగా ఒక సాధారణ పిల్లి కూనను కనింది.తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట.

వాళ్లు సిజేరియన్‌ చేసి ఈ అరుదైన 2 తలల కూనను విజయవంతంగా వెలికి తీసారట.దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు.“వింతగా పుట్టింది.చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా.

అయితే అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు!” అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే, 2 తలల పిల్లుల్ని రెండు తలల రోమన్‌ దేవత జానస్‌ పేరిట జానస్‌ క్యాట్స్‌ అని పిలుస్తారు.ఏకంగా 15 ఏళ్లు బతికిన 2 తలల పిల్లి ఇది! దీని పేరు ఫ్రాంక్‌ అండ్‌ లూయీ.1999లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో పుట్టింది.అత్యధిక కాలం బతికిన జానస్‌ క్యాట్‌గా 2012లోనే ఇది గిన్నిస్‌ బుక్కులోకి ఎక్కింది.అన్నట్టూ, ఇది 3 కళ్లతో పుట్టడం విశేషం.ఇలా పుట్టినవాటిని మనం వింతగా చూస్తాము.కానీ అక్కడ వీటిని దేవతల ప్రతిరూపాలుగా చూస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube