ప్రపంచంలోనే అత్యంత లాంగ్ కాల్... ఏకంగా 2 రోజుల పాటు మాట్లాడారు?

ఫోన్ లేనిదే ఇప్పుడు పనికాదు.ముఖ్యంగా సమాచారం ఒక చోటినుండి మరో చోటికి చేరాలంటే గంటలు తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండేది.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.క్షణాల్లో.

ఇంకా చెప్పాలంటే సెకెనుల వ్యవధిలో సమాచారాన్ని మానవుడు ఇట్టే పొందుతున్నాడు.దానికి కారణం ఫోన్స్.

అయితే ఈ ఫోన్ వాడకం ఎక్కువయ్యాక మనుషులు తమకు ఇష్టమైన వారితో గంటలు తరబడి మాట్లాడడం మొదలయ్యింది.అయితే అది ఎంతవరకు? ఎలాంటివారైనా మహాకాకపోతే ఒక గంట లేదంటే 2 గంటలు.అంతకంటే ఎక్కువగా మాట్లాడడం కష్టం కదా.

Advertisement

అయితే ఇక్కడ ఏకంగా రెండు రోజులు పాటు అనగా 48 గంటలు నిరాటంకంగా మాట్లాడడం జరిగింది.ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫోన్ కాల్, హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఎరిక్ ఆర్.

బ్రూస్టర్, అవరీ ఎ.లియోనార్డ్‌ అనే ఇద్దరు ఏకంగా 46 గంటల 12 నిమిషాల 52 సెకన్ల పాటు ఒకరితో మరొకరు మాట్లాడుకున్నారు.2012లో నమోదైన ఈ కాల్.అత్యంత పొడవైన ఫోన్ కాల్ రికార్డ్‌గా నమోదు అయింది.

వాస్తవానికి అదొక చిట్ చాట్ షో.అయితే అంతకుముందు 2009లో సునీల్ ప్రభాకర్ అత్యధిక సేపు ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు.అతను దాదాపు 51 గంటల పాటు ఫోన్ కాల్‌లో మాట్లాడాడు.

కానీ అతను వేర్వేరు వ్యక్తులతో కాల్ మాట్లాడడం జరిగింది.ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత మరో వ్యక్తికి కాల్ ట్రాన్స్‌ఫర్ అయ్యేది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి.. ఫోన్ లాక్కోగానే టీచర్‌ను చంపేస్తానన్న విద్యార్థి.. వీడియో చూస్తే..!

కాగా, గిన్నీస్ వరల్డ్ రికార్డును హివెన్ అనే ట్విట్టర్ ఖాతాదారు.ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

ఈ ఘటన 2012 నాటిది అయినప్పటికీ.‘ఎరిక్ ఆర్.బ్రూస్టర్, అవరీ ఎ.లియోనార్డ్‌ ఫోన్ కాల్’ ఇప్పటికీ అత్యంత సుదీర్ఘమైన ఫోన్ కాల్‌గా కొనసాగుతోంది.

" autoplay>

తాజా వార్తలు