టీడీపీ( TDP ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువ గళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది.టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టు అయిన వెంటనే లోకేష్ తన యువ గళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
అప్పటి నుంచి కోర్టులు, బెయిల్ కు సంబందించిన వ్యవహారాలతో పాటు, ఢిల్లీ పర్యటన వంటివి చేస్తూ బిజీగా ఉన్నారు .దీంతో యువ గళం పాదయాత్ర ( Yuvagalam padayatr )పూర్తిగా నిలిచిపోయిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో,, ఈ యాత్రను.నిలిపివేసే ప్రసక్తే లేదని లోకేష్ ప్రకటించారు.

ఈనెల 29న తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో మళ్లీ లోకేష్ పాదయాత్రను( Padayatr ) తిరిగి ప్రారంభిస్తారని టిడిపి ప్రకటించింది .అయితే చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చేవారం విచారణకు రాబోతుండడంతో పాదయాత్రను మరికొంత కాలం వాయిదా వేసుకోవాలని టిడిపి సీనియర్ నేతలు లోకేష్ కు సూచించడంతో, లోకేష్ తన యువ గళం పాదయాత్రను మరోసారి వాయిదా వేసుకున్నారు.ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా యువ గళం పాదయాత్రను పూర్తి చేసేందుకు లోకేష్ ఏర్పాట్లు చేసుకున్నారు .రాయలసీమ , కోస్తాంధ్ర జిల్లాలో దాదాపు 3000 కిలోమీటర్ల మేర పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లోకేష్ పాదయాత్ర జరుగుతూ ఉండగానే చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) కావడం తో నిలిపివేశారు.ఇదిలా ఉంటే ఏపీ ఫైబర్ నెట్ స్కాం లో లోకేష్ పేరు కూడా ఉండడం , ఆయననూ అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.లోకేష్ అరెస్టు భయంతోనే ఢిల్లీలో దాక్కున్నారని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న క్రమంలో , పాదయాత్ర నిర్వహించి ఆ విమర్శలకు చెక్ పెట్టాలని లోకేష్ భావించినా , అది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
తనను పోలీసులు అరెస్ట్ చేసినా అది జనం మధ్యే చేస్తే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని ప్లాన్ చేసుకున్నా, అనూహ్యంగా అది వాయిదా పడింది.







