టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) జైల్లో అనారోగ్యానికి గురి కావడం తెలిసిందే.స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైల్లో దాదాపు నెల రోజులకు పైగా ఉంటున్నారు.
అయితే ఒక్కసారిగా ఐదు కేజీలు తగ్గటంతో పాటు స్కిన్ ఎలర్జీతో చంద్రబాబు బాధపడటంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం పట్ల యువనేత నారా లోకేష్( Nara Lokesh ) ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు.“భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారు.ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం.
వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబు గారిని అనారోగ్య కారణాలతో అంతమొందించే ప్రణాళిక ఏదో రచిస్తున్నారు.చంద్రబాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది.
జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు గారిని ముద్దాయి అని హెల్త్ బులెటిన్ లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రతపై పెట్టడంలేదు.చంద్రబాబు గారికి ఏ హాని జరిగినా, సైకోజగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత” అని లోకేష్ ట్వీట్ చేశారు.
పరిస్థితి ఇలా ఉండగా మరొక పక్క జైల్లో చంద్రబాబుకు ఏదైనా అయితే పూర్తి బాధ్యత జగన్ ప్రభుత్వనిదే అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు సైతం హెచ్చరికలు చేస్తున్నారు.







