లోకేష్ బాబుకి మన స్టార్‌ హీరోల అందరితో లింక్‌ పెట్టేసిన మీడియా

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఈయన దర్శకత్వంలో వచ్చిన విక్రమ్‌ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్‌ హిట్‌ అయ్యింది.

మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విక్రమ్ సినిమా తో లోకేష్ కనగరాజ్ స్టార్‌ డైరెక్టర్స్ జాబితాలో చేరి పోయాడు.రాజమౌళి మరియు ప్రశాంత్‌ నీల్‌ ల కు ఏమాత్రం తీసి పోవడం లేదు అంటూ లోకేష్ కు పేరు వచ్చింది.

ఆయన తదుపరి సినిమా తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ తో ఉండబోతుంది.విజయ్ తో సినిమా తర్వాత ఖైదీ 2 ఉందట.

ఆ తర్వాత విక్రమ్‌ 2 ను ప్లాన్‌ చేశారు.ఇన్ని సినిమా లు ఉండగానే బాలీవుడ్‌ హీరో లకు మరియు టాలీవుడ్‌ హీరోలకు కూడా ఈయన కథలు వినిపించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఎన్టీఆర్‌.మహేష్ బాబు.

అల్లు అర్జున్ మరియు రామ్‌ చరణ్ లకు ఈయన కథలు వినిపించాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.అదుగో ఇదుగో అంటూ ఆయన సినిమా ల గురించి జాతీయ స్థాయి లో కథనాలు వచ్చాయి.

ఇంకా వస్తూనే ఉన్నాయి.అల్లు అర్జున్‌ తో లోకేష్ కనగరాజ్ సినిమా అంటూ వచ్చిన వార్తలను మెగా ఫ్యామిలీ సన్నిహితులు ఖండించారు.

ఇప్పటి వరకు కనీసం వారిద్దరు కలవలేదు.అలాంటప్పుడు ఎలా వారి సినిమా రాబోతుంది అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం లోకేష్ కనగరాజ్ ఇప్పట్లో తెలుగు సినిమా చేసే అవకాశం లేదు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఆయన ఇతర ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉన్నాడు.ఆయన సినిమా లు పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.

Advertisement

ఆ రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.అప్పటి వరకు లోకేష్ కనగరాజ్ తో మన హీరో ల సినిమా లు అంటూ మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కూడా గాలి వార్తలు అన్నట్లే.

కనుక లోకేష్ బాబు తదుపరి సినిమా లు ఆయన అధికారికంగా ప్రకటిస్తే తప్ప నమ్మడానికి వీలు లేదు అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు.

తాజా వార్తలు