తిరుపతిలో ఇంకా లభ్యంకాని ఐదుగురు విద్యార్థుల ఆచూకీ..!

తిరుపతిలో అదృశ్యమైన ఐదుగురు పదో తరగతి విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.నిన్న ఉదయం స్కూలు నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కనిపించకుండా పోయారు.

 Location Of Five Students Who Are Still Missing In Tirupati..!-TeluguStop.com

తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.విద్యార్థుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇందులో భాగంగా అన్ని స్టేషన్లకు అలర్ట్ మెసేజ్ లు ఇచ్చారు పోలీసులు.అదేవిధంగా విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నారు.

అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు ఇన్‎స్టాగ్రామ్‎లో ఆన్ లైన్ లోకి వచ్చినట్లు గుర్తించారు.కాగా మిస్సింగ్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థి ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube