2023లో మోత మోగించడానికి సిద్ధం అవుతున్న భారీ మూవీలు ఇవే!

2022 ఏడాది వచ్చి అప్పుడే పూర్తి కూడా కాబోతుంది.2020 నుండి కరోనా కారణంగా వెలవెలబోయిన బాక్సాఫీస్ 2022 లోనే కతా పుంజుకుంది.ఆ రెండేళ్లు సినీ ఇండస్ట్రీ చాలా సఫర్ అయ్యింది.ఎన్నో కోట్ల నష్టాన్ని భరించింది.పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకున్నారు.అయితే 2022 సంక్రాంతి సీజన్ నుండి కాస్త టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది.

 Telugu Movies 2023, List Of Tollywood Films 2023, Waltair Veerayya, Megastar Chi-TeluguStop.com

స్టార్ హీరోలే కాదు చిన్న హీరోలు సైతం మంచి సక్సెస్ సాధించారు.

ఇక ఇప్పుడు 2022 ముగింపు దశకు చేరుకుంది.

మరో రెండు నెలలు గడిస్తే ఈ ఏడాది పూర్తి అయ్యి 2023 ఎంటర్ అవుతుంది.ఇక 2023 సంక్రాంతి నుండే భారీ పోటీ నెలకొనబోతుంది.

మరి 2023 ఏడాదిలో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు చాలానే రెడీ అవుతున్నాయి.అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ఆదిపురుష్.

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది.ఇక ఇదే సంక్రాంతికి దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న వారసుడు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

Telugu Dhamaka, Dussehra, List Tollywood, Mahesh Babu, Chiranjeevi, Nani, Pawan

విజయ్ దళపతి హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి.ఈ రెండు సినిమాలే కాకుండా మరో సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Telugu Dhamaka, Dussehra, List Tollywood, Mahesh Babu, Chiranjeevi, Nani, Pawan

ఇక సంక్రాంతి తర్వాత సమ్మర్ కి ముందే మరిన్ని సినిమాలు లైన్లో పెట్టుకున్నారు స్టార్స్.పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు కూడా 2023 లోనే రిలీజ్ కానుంది.మొదటిసారి పవన్ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.

దీంతో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.అలాగే నాని దసరా సినిమా, రవితేజ ధమాకా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

ఇంకా మహేష్ SSMB28 కూడా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.ప్రభాస్ మరో సినిమా సలార్, రామ్ చరణ్ ఆర్సీ15, కమల్ హాసన్ ఇండియన్ 2 సెకండాఫ్ లో రానున్నాయి.

ఎన్టీఆర్ 20 సైతం సెకండాఫ్ తర్వాత వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube