ఉగాది వరకు ఏపీలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వైసీపీలో రోజురోజుకు జోష్ ఊపందుకుంటోంది.ఆశావహులు పదవిపై ఆశలు పెట్టుకోగా మరోవైపు కాబోయే మంత్రులు ఎవరో తమకు తెలుసంటూ జోస్యం చెబుతున్నారు.
అయితే జగన్ మదిలో కొత్త మంత్రులు ఎవరనేది ఉందట.అది చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు.
కానీ, కాబోయే మినిస్టర్స్ ఎవరో పసిగట్టి హుషారుతో కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు.ఆయా జిల్లాల్లో సమీకరణాలు చూసుకుంటూ వారి స్టైల్‌లో వశ్లేషించుకుని వారే మినిస్టర్లు అంటూ ప్రచారం చేస్తున్నారని టాక్.
అంతకు తగ్గట్టు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ ఊహాలోకంలో తేలిపోతున్నారట.
అయితే అసెంబ్లీ లాబీల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే వారి వద్దకు వచ్చిన మిగిలిన ఎమ్మెల్యేలు వారికి అభినందనలు చెబుతూ మీరే కాబోయే మంత్రులు అంటూ కితాబిస్తుండడం చర్చణీయాంశంగా మారింది.
అంతేకాదండోయ్ సదరు ఆశావహులకు కరచాలనం చేసి మరి కంగ్రాట్స్ చెబుతున్నారట.ఇందులో క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఉన్నారట.అంతేకాకుండా విశాఖ రూరల్ జిల్లాకు చెందిన గుడివాడ అమరనాథ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దాడిశెట్టి రాజా ఉన్నారట.అయితే ఈ ముగ్గురికి జగన్‌తో మంచి తత్సంబంధాలు కూడా ఉన్నాయి.
ఇదే ఫ్యూచర్ మినిస్టర్స్‌కు లీక్‌గా మారుతోందని భావిస్తుండడం గమనార్హం.వీరికి గతంలో పలు హామీలు ఇచ్చారు కూడా.
వీరికి బలమైన సామాజిక వర్గం అండదండలు ఉండడం కలిసొచ్చే అంశాలుగా పేర్కొంటున్నారు.

మొత్తంగా తూర్పు గోదావరి జిల్లాలో కురసాల కన్నబాబు స్థానంలో దాడిశెట్టి రాజా రాబోతున్నారనే టాక్ కూడా ఉంది.ఎందుకంటే ఈయన బలమైన కాపు సామాజిక వర్గం ఉన్న తునిలో టీడీపీ నేత యనమల రామక్రిష్ణుడు ఫ్యామిలీని రెండు సార్లు ఓడించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.అలాగే విశాఖకు చెందిన గుడివాడ అమరనాధ్ ఆయన తండ్రి గురునాథరావు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు.
ఇక వైసీపీలో యువ దూకుడు నేతగా అమరనాథ్ ఉన్నారు.ఆయనకు కాపు సామాజిక వర్గం అండ ఉంది.
ఇక్కడ కూడా గుడివాడ కే స్థానం లభించనుందని సమాచారం.

మరోవైపు క్రిష్ణా జిల్లాలో కొలుసు పార్థసారధికి బలమైన యాదవ సామాజిక వర్గం అండ ఉంది.దీంతో నెక్స్ట్ మినిస్టర్ పార్థసారధేనని టాక్.గతంలో వైసీపీ సీనియర్ నేతగా ఉన్నా ఆయనకు పదవి దక్కలేదు.
ఈసారైతే ఆయనే మినిస్టర్ అంటున్నారు.మొత్తంగా జగన్ క్యాబినెట్‌లో ముగ్గురు కాబోయే మంత్రుల లిస్ట్ ఇలా లీక్ అయిందని చెప్పొచ్చు.
అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు మిగిలిన వారి పేర్లు కూడా ఎమ్మెల్యేలే చెబుతారా ? అనే సందేహం కలుగకమానదు.అసలు మినిస్టర్స్ ఎవరన్నది ? ఉగాది దాకా వేచి చూడాల్సిందే.