తెలంగాణాలో ఓ వింత హోటల్.! తింటే రూ.50 వసూలు చేస్తారు...తినకపోయినా 50 వసూలు చేస్తారు.!

కర్రీ పాయింట్స్,హోటల్స్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ఈ తరుణంలో ఫుడ్ కి అంత విలువ లేకుండా పోయింది.మన ఆకలి తీర్చే అన్నాన్ని నచ్చితే తింటాం,లేకపోతే పారేస్తాం అనుకునే స్థాయికి వెళ్లాం.

 Lingala Kedari Foodcourt From Warangal Different Hotel And Rules-TeluguStop.com

ఒకప్పుడు కింద ఒక్క మెతుకు పడకుండా తినాలి అని అమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు మచ్చుకైనా వినపడట్లేదు.ఇక హోటల్స్ లో పరిస్థితి చెప్పక్కర్లేదు.

రకరకాల ఫుడ్ ఐటెంస్ ఆర్డర్ ఇస్తాం.ఇష్టముంటే తింటాం లేకపోతే లేదు.

పారేస్తే అడిగే వారుండరు.బిల్ కడితే చాలని హోటల్ వాడనుకుంటాడు.

బిల్ కడుతున్నాం కదా మా ఇష్టం తినకుండా వదిలేస్తాం అని బిల్ పే చేసే వారనుకుంటారు.ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ వేస్ట్ చేయకూడదనే సూత్రంతో నడుస్తుంది ఒక హోటల్ అదెక్కడ…

కేదారి ఫుడ్ కోర్ట్…వరంగల్…

వరంగల్ జిల్లా కేంద్రం లో 3 దశాబ్దాల క్రితం ఒక చిన్నగా ప్రారంభమైన ఈ హోటల్.జిల్లా వాసులకి సుపరిచితం.ఇక్కడ లభిస్తున్న భోజనమే కాదు అక్కడ ఉండే పరిసరాలు కూడా అందరికిఆహ్లాదం.

లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ గా ప్రారంభమైన హోటల్ ప్రస్థానం.ఇప్పుడు సంచలనాలకు సామాజిక మార్పులకి కేరాఫ్ అడ్రస్ గా మారింది.

ఈ హోటల్ లో ఆలా కాదు ఎంత తినాలి అనిపిస్తుందో అంతే తినాలి ఆలా కాదు మేము తినేది తింటాం వీలు కాకపోతే పడేస్తాం అంటే తినాలిసిందే అని వత్తిడి తెస్తారు అప్పటికి తినకపోతే మీరు కచ్చితంగా ఫైన్ కట్టాలి.ఎందుకు అంటే ఒకరు ప్రతి రోజు వృధా చేసే అన్నం ఏడాది లో ఒక బియ్యం బస్తా అని అంటారు.కడుపు నిండా తినాలి లేదా ఆ భోజనం వేరే వాళ్ల కడుపు నింపేలా ఉండాలి అని అంటారు ఈ హోటల్ యాజమాన్యం.3 దశాబ్దాల క్రితం హోటల్ రంగంలోకి అడుగుపెట్టిన లింగాల కేదారి దంపతులు నేటికీ వంటశాలలో బిజీగా కనిపిస్తారు.తమను ఆదరించిన వారికీ ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో అలాగే చేసి వాళ్లే స్వయంగా వడ్డిస్తారు.అంతే కాదు ప్రతి రోజు కస్టమర్లకి వడ్డించే ఆహారమే వాళ్ళు తింటారు.

షరతులు

భోజనం వృధా చేస్తే మాత్రం కచ్చితంగా ఫైన్ వేస్తారు .ఫైన్ వసూల్ చేసే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.అన్నం కానీ కూర కానీ ఏది వృధా చేసిన ఊరుకోరు.ఒకవేళ ఎవరన్నా వృధా చేస్తే ఎంత పెద్ద గొడవ జరిగిన సరే ఫైన్ వసూల్ చేసే దాకా ఊరుకోరు.

భోజనం బాగుగాకపోతే చెప్పండి మేమె ఫైన్ కడతాం అని అంటారు.ఇప్పటి వరకు 300 మందికి ఫైన్లు వేసాం అన్ని లింగాల దంపతులు చెబుతున్నారు.పోలీసులు కూడా జరిమానా కట్టారు అని చెప్పారు.వచ్చిన డబ్బులు నీరు పేదలకి ఖర్చు చేస్తాం అని చెప్పారు.

ప్రత్యేకతలు

గతంలో ఒక టీ కి ఇంకో టీ ఫ్రీ ,ఒక టిఫిన్ కి ఇంకో టిఫిన్ ఫ్రీ , ఒక భోజనానికి ఇంకో భోజనం ఫ్రీ అంటూ ఆఫర్స్ ఇచ్చారు.అలాగే మిగతా హోటల్స్ కంటే సగం ధరలకే నాణ్యమైన భోజనం అందించారు.అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో రోజుకు రూ.10000 ఖర్చుతో ఉచిత భోజనం ఆడించారు ఈ లింగాల దంపతులు.నిరుపేదలకు, గ్రామాల నుంచి వచ్చిన వారికి భోజనం అందచేశారు.ఆ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా టీ అందించారు.

ఈసారెప్పుడైనా వరంగల్ వెళ్తే ఈ హోటల్ ని దర్శించుకుని కడుపు నిండా తిని రండి.అదేవిధంగా ఆహారం వృదా చేయలేదు అనే ఆత్మసంతృప్తితో రండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube