మక్కా క్లాక్ టవర్ పై పిడుగు.. వీడియో వైరల్!

మక్కా చాలా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.ముస్లింలకు ఎంతో పవిత్రమైన స్థలం.

 Lightning Strike On Mecca Clocktower Video , Lightning, Mkkah Clock Tower, Viral-TeluguStop.com

మక్కా క్షేత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.ఆ దృశ్యాలు చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపట్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి.వేలాది మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.అసలేం జరిగిందో తెలుసుకువాలని ఉందా.

అయితే ఈ వార్త చదివేయండి మరి.

సౌదీ అరేబియా మక్కాలోని ప్రఖ్యాత క్లాక్ టవర్ పై పిడుగు పడింది.ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కచ్చితమైన తేదీ, సమయం తెలియదు.ఓ రోజు సాయంత్రం వర్షం కురుస్తుండగా బుర్జ్ అల్ సా గడియార స్తంభంపై భారీ పిడుగు పడింది.కాసేపటి వరకు పిడుగు పాటు జరిగింది.

నగరం అంతా ఒక్క సారిగా మెరిసి పోయింది.ఈ వీడియోను ట్విట్టర్ లో ఓ యూజర్ పోస్టు చేశారు.

లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వ విద్యాలయంలో ఖగోళ శాస్త్రం చదువుతున్న ముల్హాం హెచ్ అనే ట్విట్టర్ యూజర్ శుక్రవారం నాడు ఈ వీడియోను షేర్ చేశారు.

షేర్ చేసిన కాసేపట్లో ఈ వీడియో చాలా మంది నెటిజన్లు వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube