మక్కా క్లాక్ టవర్ పై పిడుగు.. వీడియో వైరల్!

మక్కా చాలా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.ముస్లింలకు ఎంతో పవిత్రమైన స్థలం.

మక్కా క్షేత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.ఆ దృశ్యాలు చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపట్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి.వేలాది మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.అసలేం జరిగిందో తెలుసుకువాలని ఉందా.

అయితే ఈ వార్త చదివేయండి మరి.సౌదీ అరేబియా మక్కాలోని ప్రఖ్యాత క్లాక్ టవర్ పై పిడుగు పడింది.

ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కచ్చితమైన తేదీ, సమయం తెలియదు.

ఓ రోజు సాయంత్రం వర్షం కురుస్తుండగా బుర్జ్ అల్ సా గడియార స్తంభంపై భారీ పిడుగు పడింది.

కాసేపటి వరకు పిడుగు పాటు జరిగింది.నగరం అంతా ఒక్క సారిగా మెరిసి పోయింది.

ఈ వీడియోను ట్విట్టర్ లో ఓ యూజర్ పోస్టు చేశారు.లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.

జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వ విద్యాలయంలో ఖగోళ శాస్త్రం చదువుతున్న ముల్హాం హెచ్ అనే ట్విట్టర్ యూజర్ శుక్రవారం నాడు ఈ వీడియోను షేర్ చేశారు.

షేర్ చేసిన కాసేపట్లో ఈ వీడియో చాలా మంది నెటిజన్లు వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.

డెలివరీ తర్వాత జుట్టు అధికంగా రాలిపోతుందా.. అయితే ఇదే బెస్ట్ సొల్యూషన్!