లైగర్‌లో పోకిరి సీన్ రిపీట్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ చూస్తున్నారు.

 Liger To Have Suspense Reveal Like Pokiri, Liger, Pokiri, Vijay Devarakonda, Pur-TeluguStop.com

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.కాగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్లు చిత్ర పోస్టర్స్ చూస్తే మనకు అర్థం అవుతోంది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా మనల్ని ఎంటర్‌టైన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

అయితే ఈ సినిమాలో పోకిరి తరహా ఎలిమెంట్ ఒకటి ఉంటుందని, అది ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రంలో ప్రీ-క్లైమాక్స్ సస్పెన్స్ రివీల్ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించిందో అందరికీ తెలిసిందే.ఆ ఒక్క సీన్‌తో పోకిరి సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు.

ఇప్పుడు లైగర్ చిత్రంలో కూడా అచ్చం ఇలాంటి సస్పెన్స్ సీక్వెన్స్ ఒకటి ఉందని తెలుస్తోంది.ఈ సినిమాలోని ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ లైగర్ చిత్రానికి ప్రాణంగా ఉండబోతుందట.

ఏదేమైనా పోకిరి లాంటి సస్పెన్స్ ఉంటే మాత్రం లైగర్ చిత్రం కూడా అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని పూరీ ఫ్యాన్స్ అంటున్నారు.మరి ఈ సినిమాలో ఉండబోయే ఆ సస్పెన్స్ ఏమిటనేది తెలియాలంటే మాత్రం లైగర్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెప్పించనుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను బాలీవుడ్‌లో కరణ్ జోహర్ రిలీజ్ చేస్తుండటంతో అక్కడ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube